ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ గురించి ప్రతీ ఒక్కరిలో ఆందోళన ఉంది. చైనాలో పుట్టిందని చెప్పుకుంటున్న ఈ వైరస్ ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచ దేశాలంతటికీ విస్తరించింది. చైనా తర్వాత కరోనా ప్రభావం వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయిన దేశం ఇటలీ. ప్రస్తుతం ఇటలీ కరోనా కోరల్లో చిక్కుకుని ఉంది. అక్కడ మొత్తం వీధులన్నీ ఖాళీ అయ్యాయి. జనాలు బయటకి వస్తే శిక్షలు వేస్తామని కూడా చెప్పారని వార్తలు వస్తున్నాయి. 

 

 

 

కరోనా వైరస్ ని తేలికగా  తీసుకుపోవడం వల్లనే అది అంత త్వరగా విస్తరించిందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే అంతగా ప్రబలిందని, మహమ్మారిలా మారి ప్రపంచాన్ని వణికిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఈ కరోనా వైరస్ తెలంగాణకి కూడా పాకడంతో తెలంగాణ అంతటా అప్రమత్త చర్యలు తీసుకోవడం ప్రారంభించింది ప్రభుత్వం. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం స్కూళ్ళు, థియేటర్లు మాల్స్ అన్నీ మూసివేయాలని సూచించింది.

 

 

రాష్ట్రమంతటా కరోనా గురించి పెద్ద ఎత్తున అవగాహన కలిగిస్తున్నారు. ఈ అవగాహనా కార్యక్రమాల్లో సినిమా తారలు కూడా పాల్గొంటున్నారు. అయితే అందరికంటే భిన్నంగా మంచు మనోజ్ చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందించదగ్గది. కరోనా గురించి తెలిసిన వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రతని పాటించాలని, శానిటైజర్ ని తమ వెంట ఉంచుకోవాలని చూస్తున్నారు. కానీ దీని గురించి తెలిసిన వారు కూడ మాస్క్ లు కొనలేకో, శానిటైజర్ బాటిల్ కొనడానికి  డబ్బుల్లేకో అవస్థలు పడుతున్నారు.

 

 

అయితే మంచు మనోజ్ ఇలాంటి వారికి తనకి తోచిన సాయం అందిస్తున్నాడు. మాస్క్ లు, శానిటైజర్ బాటిళ్లని అఫార్డ్ చేయలేని వారికి వాటిని ఇప్పించి కరోనా గురించి జాగ్రత్త పడమని చెప్పుతున్నాడు. నిజంగా మంచు మనోజ్ చేస్తున్న ప్రయత్నం చాలా మంచిదే.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: