సినిమాకు ఎంతమంది పనిచేసినా.. బడ్జెట్ ఎంతైనా.. స్టార్ కాస్ట్ ఎంత ఉన్నా.. ప్రొడ్యూసర్ ఎవరైనా.. అందరు వినేది ఒక్కరి మాటే ఆయనే దర్శకుడు. సినిమాకు కెప్టెన్ అడ్డు ది షిప్ అంటారు. దర్శకుడి మీదే అన్ని బాధ్యతలు ఉంటాయి. ఒక సినిమా హిట్టయినా ఫ్లాప్ అయినా బాధ్యత వహించే వ్యక్తి దర్శకుడే. అందుకే దర్శకుడు సినిమా పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటారు. స్టార్ సినిమాలు కొన్ని దర్శకులు ఎవరైనా ఆడేస్తాయని అంటారు కానీ వాటిల్లో కూడా దర్శకుడి ప్రతిభను గుర్తించాల్సిందే. 

 

రెండున్నర గంటల సినిమా అనుకున్న విధంగా వచ్చి అద్భుతాలు సృష్టిస్తే అది దర్శకుడి గొప్పతనమని చెప్పొచ్చు. అదే సినిమా అంచనాలను అందుకోకుండా ఉంటె అదః పాతాళానికి తొక్కేస్తుంది. ఈ రెండు ఫలితాలు కూడా దర్శకుడు చూపే ప్రతిభను బట్టి ఉంటాయి. సినిమా మొదలైంది మొదలు రిలీజ్ అయ్యేంతవరకు దర్శకుడు పడే మనోవేదన చెప్పలేనిది. అంతేకాదు సినిమా ఫలితం అంచనాలను అందుకుంటే సరే కానీ స్టార్ తో తీసి ఆ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోతే మాత్రం కెరియర్ రిస్క్ లో పడినట్టే. 

 

కొందరు దర్శకులు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు చూడని కొత్త అనుభూతిని ఇచ్చే సినిమాలు ఇవ్వాలని కొందరు ఆరాటపడతారు.. కొందరు మాత్రం రొటీన్ ఫార్మేట్ లో సినిమాలు తీసి సక్సెస్ అవుతుంటారు. ఏది చేసినా ఎలా చేసినా దర్శకుల మెయిన్ టార్గెట్ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడమే.. ప్రేక్షకులే వీరి ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తారు. హీరో అయినా తన పోర్షన్ చేసి ఊరుకోవచ్చు.. నిర్మాత డబ్బులు పెట్టి సైలెంట్ గా ఉండొచ్చు.. కానీ దర్శకుడు మాత్రం పూర్తిగా సినిమాకు కష్టాన్ని అంతా పెట్టేస్తాడు. సినిమా హిట్ అయ్యి మంచి పేరు వస్తే సరే కానీ తేడా వస్తే మాత్రం పడిన కష్టం వృధా అయినట్టే లెక్క. 

మరింత సమాచారం తెలుసుకోండి: