తెలుగు బుల్లితెరపై మహిళామణులు యాంకరింగ్ లో మహరాణుల్లో వెలిగిపోతున్న సమయంలో మెయిల్ యాంకర్ గా తన సత్తా చాటాడు ప్రదీప్ మాచిరాజు.  ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా పనిచేస్తున్న ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు బుల్లితెరపైనే కాదు వెండితెరపై కూడా తన సత్తా చాటేందుకు వస్తున్నాడు.  యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు హీరోగా, అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. యస్‌.వి. బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.  ఈ మూవీ ప్రమోషన్ సందర్భంగా ప్రదీప్ మాచిరాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ కథ తన వద్దకు ఎలా వచ్చిందో అన్న విషయంపై వివరించాడు.  

 

నేను పుట్టింది అమలాపురం.. కానీ పెరిగింది మాత్రం మొత్తం హైదరాబాద్ లోనే.. అందుకే నాకు ఇక్కడ కల్చర్ బాగా అలవాటైందని అన్నాడు. యాంకర్ గా ప్రస్ధానం మొదలు పెట్టిన తర్వాత కొన్ని ఇబ్బందులు పడ్డాను.  ఇక్కడ ఫిమేల్ యాంకర్ల హవా కొనసాగుతున్న సమయంలో నేను మేయిల్ యాంకర్ గా నిలబడటానికి చాలా కష్టపడ్డాను. అదృష్టం కొద్ది నాకు మంచి కార్యక్రమాల్లో యాంకరింగ్ చేసే ఛాన్స్ వచ్చంది.  ఢీ, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా నా కెరీర్ కి బాగా దొహదపడింది అన్నారు.  ఈ కథను దర్శకుడు మున్నా నా కోసం రాయలేదు.

 

ఆయన కథను సిద్ధం చేసుకున్న తరువాత, తన ఇంట్లో టీవీలో వస్తున్న నా ప్రోగ్రామ్ చూస్తూ ఆయన తల్లీ .. భార్య అదే పనిగా నవ్వుతున్నారట. ఈ సినిమా కథలో ఆడవాళ్ల ప్రాధాన్యత ఎక్కువగా ఉండటం వలన ఈ మూవీ నాతో తీస్తే బాగుంటుందని భావించారట. అలా ఆయన నన్ను ఎంచుకున్నాడు. అలా ఆ కథ నా దగ్గరికి వచ్చింది అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: