త్రివిక్రమ్ తెరకెక్కించిన ఖలేజా సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలగలిపి అహం బ్రహ్మస్మి అనే కథాంశాన్ని ఎంచుకొని చాలా చక్కగా ఎంతో ఫిలాసఫీని తెలుగు ప్రేక్షకులకు తెలియచెప్పాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. బాలి అనే ఒక ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఒక టాక్సీ డ్రైవర్ కాపాడడమే ఈ సినిమా యొక్క సారాంశం. దేవుడు గురించి ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఎంతో ఫిలాసఫికల్ గా తీసిన ఈ సినిమా ఒక కళాఖండం అని చెప్పుకోవచ్చు. ఖలేజా సినిమాలో ఒక టాక్సీ డ్రైవర్ 534 మంది ప్రజలను కాపాడాలి. అయితే ఇందులో నిస్వార్థంగా సహాయం చేసే వాడే నిజమైన దేవుడు అనే ఒక నిగూఢ అర్ధం దాగుంది.




ఒక సన్నివేశంలో సీతారామరాజు( మహేష్ బాబు) ఒక బైకర్ ని ఆపి డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. ఒకసారి ఏమో తన కోసం అడుగుతాడు కానీ రెండోసారి ఏమో వేరే అబ్బాయి కోసం అని అడుగుతాడు. ఇక్కడే దేవుని యొక్క అర్థం తెలుస్తుంది. అలాగే మహేష్ బాబు ని ఒక టాక్సీ డ్రైవర్ గా చూపించిన త్రివిక్రమ్ చురుకైన డైలాగులను రాసి ఎప్పుడూ గుర్తిండిపోయే సన్నివేశాలను తెలుగు ప్రజలకు అందించారు.




ఈ సినిమాని శ్రద్ధగా చూస్తే సీతారామరాజు పాత్రలో దేవుడు అంటే ఏమీ ఆశించకుండా సహాయం చేసేవాడు అనే కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. ఒక సన్నివేశంలో సీతారామరాజు బిలావర్ సింగ్ చనిపోయి ఓ పర్సు ని తన కారులో మర్చిపోతే అదే ఇవ్వడానికే తాను బాలి గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యుల పరిస్థితిని చూస్తే తన ఈవో రావాల్సిన ఇన్సూరెన్స్ వదిలేస్తాడు. అలాగే తనకి అవసరం లేకపోయినా బాలి గ్రామాన్ని కాపాడతాడు. దీన్ని బట్టి చూస్తే సీతారామరాజు అనే పాత్రలో ఉన్నది ఒక నిస్వార్థం ఉన్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే హీరో తో కామెడీ పండిస్తూనే.. మరో వైపు నిస్వార్థం గా ఉండే మనిషే ఒక దేవుడు అని చాలా అద్భుతమైన రీతిలో చూపించాడు త్రివిక్రమ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: