తెలుగులో చాలా మంది దర్శకులు ఉన్నారు. ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఎంతో మంది దర్శకులు ఉన్నా వారంతా మాస్ ప్రేక్షకులని మెప్పించడంలో చాలా సార్లు తడబడ్డారు. పక్కా మాస్ ఎంటర్ టైనర్ మూవీ తీయాలంటే కొందరు దర్శకులకి మాత్రమే సాధ్యం. ఒక వివి వినాయక్, శ్రీనువైట్ల, రాజమౌళి ముఖ్యులు. ఇక వీరందరిలోకి డిఫరెంట్ గా ఉండే ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ సినిమాల్లోకి వచ్చినప్పటి నుండి హీరీ ఆటిట్యూడ్ పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు హీరో అంటే అన్నీ మంచి లక్షణాలే ఉండాలి అనుకునే వారు.

 

కానీ పూరి రాకతో ఆ మంచీ లక్షణాలన్నింటినీ పక్కన పెట్టేశాడు. ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడటం. ఎవ్వరితో అయినా పంచ్ డైలాగులు మాట్లాడటం అలవాటు చేశాడు. పూరి చేసిన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు చూసుకుంటే హీరో ఒకేలా ఉంటాడు. అదే ఆటిట్యూడ్ తో ఉన్నా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. పూరితో సినిమా చేస్తే హీరోల రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంటుంది.

 

మహేష్ బాబు కి పోకిరి సినిమాతోనే అంతటి స్టార్ డమ్ వచ్చింది. అప్పట్లో ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇంకా మరో విషయం ఏంటంటే పూరి జగన్ సినిమాల్లో హీరోకి ఓ ప్రత్యేక స్టైల్ ఉంటుందు. అప్పటి వరకు ఆ హీరో ఎన్ని సినిమాల్లో కనిపించినా పూరి సినిమాకి వచ్చేసరికి పూర్తిగా మారిపోతాడు. మన డార్లింగ్ ప్రభాస్ నే తీసుకుంటే బుజ్జిగాడు సినిమాలో ఎలాంటి వైవిధ్యం చూపించాడో తెలిసిందే.

 

అసలు ప్రభాస్ అలా మాట్లాడుతాడా అందరూ షాకయ్యారు. ఇక రీసెంట్ గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లోనూ అదే జరిగింది. అప్పటి వరకూ చాక్లెట్ బాయ్ లా కనిపించిన రామ్ ని మాస్ లుక్ లో కి దించేశాడు. ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పూరి జగన్నాథ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: