మాటల మాంత్రికుడు మాటలు వింటే ఆలా నిమగ్నం అయిపోవలసిందే. ఈ దర్శకుడు విలువలని చూపిస్తాడు. ఈయన రచన హాస్యానికి, ఆలోచనలని రేకెత్తించే ధృక్పధానికి, కుటుంబ విలువలకి  త్రివిక్రమ్ శ్రీనివాస్ పెట్టింది పేరు. ఇప్పటికి అనేక సినిమాలకి దర్శకత్వం వహించాడు. తెలుగు సినిమాలలో బాగా హిట్ కొట్టే దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు, త్రివిక్రమ్ శ్రీనివాస్  ఎందరో టాప్ హీరోలకి మంచి సక్సెస్ అందించారు. ఇలా అయన తనదైన శైలితో ప్రేక్షకులని మెప్పిస్తాడు.

 

IHG

 

మాటల రచయితగా, స్క్రీన్ రచయితగా, దర్శకుడిగా, వాణిజ్య ప్రకటనల దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్  మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇలా మన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎనలేని స్థానం కైవసం చేసుకున్నాడు. 1999 సంవత్సరం నుండి సినిమాలలో రాణిస్తున్నాడు. హాస్యానికి ప్రసిద్ధులు త్రివిక్రమ్ శ్రీనివాస్. సైమా పురస్కారం, ఫిలిం ఫేర్ అవార్డు సౌత్, నంది పురస్కారం సొంతం చేసుకున్నాడు.

 

స్వయంవరం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేక సినిమాలతో విజయాన్ని అందుకున్నాడు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు సినిమాలకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కధ, స్క్రీన్ ప్లే, రచయితగా వ్యవహరించాడు. ఈ మాటల మాంత్రికుడు ఆ తరవాత అతడు, జులాయి, అత్తారింటికి దారేది సినిమాలకు దర్శకుడిగా తెలుగు సినీ రంగంలో అద్భుతం  సృష్టించాడు.

IHG

 

భయపడడం లోనే పడడం ఉంది మనం పడొద్దు లెగుద్దాం, ఆశ కేన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది భయం అల్సర్ ఉన్న వాడిని కూడా చంపేస్తుంది అంటూ అద్భుతమైన సంభాషణని అందించాడు త్రివిక్రమ్ జులాయి సినిమాలో. ఇలా నువ్వు నాకు నచ్చావ్, అ ఆ వంటి సినిమాలలో అద్భుతమైన డైలాగ్స్ ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇలా మంచి స్టైల్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి కధల్ని అందించాడు. ఆ మాటల మాంత్రికుడు సినిమాలో మాటలకి ఫిదా అవ్వక తప్పదనే చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: