డాలర్ డ్రీమ్స్  సినిమాకి దర్శకత్వం వహించి ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. తన మొదటి అడుగుకు కంగు తిన్నారు సాటి దర్శకులు. డాలర్ డ్రీమ్స్ చిత్రానికే ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నాడు శేఖర్ కమ్ముల. అయితే తర్వాత ఆనంద్ సినిమా తో మరో అడుగు వేసాడు. ఈ సినిమా మంచి కమర్షియల్ విజయం ఇచ్చింది. మంచి కథలతో రొటీన్ కి భిన్నంగా ఉంటాయి ఈ దర్శకుడి సినిమాలు. శేఖర్ కమ్ముల దర్శకత్వం అందర్నీ మెప్పిస్తుంది.

IHG

 

అయితే ఇతర దర్శకులతో పోల్చుకుంటే శేఖర్ కమ్ముల స్టైల్ కొంచెం భిన్నంగా ఉంటుంది, ఇతని సినిమాలలో హింస, అశ్లీలత వంటివి ఉండవు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలే అన్నీ. అందుకే ఇతని డైరక్షన్ అందరితో పోలిస్తే కాస్త విరుద్ధంగా ఉంటుంది. కుటుంబం అంతా కలిసి చూసేలా ఈయన సినిమాలు ఉండడం ఇతని దర్శకత్వానికి ప్లస్ పాయింట్.

కేవలం దర్శకుడు మాత్రమే కాదు. మంచి రచయత, నిర్మాత కూడా. శేఖర్ కమ్ముల ఇంటర్ పూర్తి అయ్యాక మెకానికల్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. ఆ తర్వాత పీజీ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. కొద్ది కాలం సమాచార సాంకేతిక రంగం లో పని చేసాడు. అమెరికాలోని న్యూజెర్సీ వెళ్ళిన శేఖర్ కమ్ముల మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరాడు అక్కడున్న హోవార్డ్ యూనివర్సిటీలో.

IHG

 

డాలర్ డ్రీమ్స్, ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా ఇలా ఈ సినిమాలకి దర్శకత్వం వహించాడు. హ్యాపీడేస్ సినిమాతో ఇంజినీరింగ్ కళాశాల రోజులు ఇలా ఉంటాయి అని కంటికి కట్టేటట్టు చూపించాడు ఈ దర్శకుడు. మంచి కుటుంబ కధా చిత్రాలతో ఆకట్టుకుంటాడు. చక్కగా కుటుంబం అంతా చూసేలా ఉంటాయి శేఖర్ కమ్ముల చిత్రాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: