కళా తపస్వి , పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ తెలుగులో మంచి దర్శకుడు. ఈయన తెలుగు సినిమాలకి ప్రత్యేక గౌరవాన్ని, గుర్తింపుని తీసుకొచ్చారు. అంతే కాకుండా సినిమాలు తీస్తూ సినీ రంగం వైపు ఎంతో కృషి చేసారు. దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం కూడా ఈయన సొంతం చేసుకున్నారు. కళా తపస్వి అని కె. విశ్వనాధ్ అని ఈయనని సంభోదిస్తారు. ఈయన సుప్రసిద్ధ టీవి దర్శకుడు, మంచి నటుడు, కధా రచయత, స్క్రీన్ ప్లే రచయత, శబ్ద గ్రాహకుడు కూడా. 

 

IHG

 

ఆత్మ గౌరవం, అల్లుడు పట్టిన భరతం, సిరి సిరి మువ్వలు, ఆపద్భాంధవుడు, నేరము శిక్ష, స్వాతి ముత్యం, అమ్మ మనసు, శుభ సంకల్పం, సాగర సంగమం, జనని జన్మభూమి, జీవిత నౌక, జీవన జ్యోతి, చెల్లెలి కాపురం, ఉండమ్మా బొట్టు పెడతా ఇలా అనేక సినిమాలకి దర్శకత్వం వహించి ప్రాణం పోసాడు కె. విశ్వనాధ్ .

 

కె. విశ్వనాధ్  ఎక్కువగా సంగీతానికి ప్రాణం ఇస్తాడని తెలిసినదే. అయితే అతని సినిమాలకి  కె. వి. మహదేవన్, నుగానీ, ఇళయ రాజా వంటి సంగీత దర్శకులని ఎంపిక చేసుకునే వాడు కె. విశ్వనాధ్ . ఆ తర్వాత దర్శకుడి బాధ్యతలు బాగా తగ్గించి నటుడిగా సాగాడు కె. విశ్వనాధ్ . 

 

IHG

 

లాహిరి లాహిరి లాహిరిలో, సంతోషం, వజ్రం, ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే, సీమ సింహం, నీ స్నేహం, కుచ్చి కుచ్చి కూనమ్మా, లక్ష్మి నరసింహ, ఠాగూర్, అతడు ఇలా అనేక సినిమాలలో నటించాడు కె. విశ్వనాధ్. 1980 లో జాతీయ ఉత్తమ కుటుంబ కధా చిత్రం అవార్డు లభించింది శంకరాభరణం చిత్రానికి. 1984 లో సాగర సంగమం సినిమాకి ఉత్తమ చలన చిత్రం అవార్డు వచ్చింది. ఇలా అనేక అవార్డుని పొందాడు విశ్వనాధ్.  

మరింత సమాచారం తెలుసుకోండి: