తెలుగులో నానీ సినిమా అనగానే ఒక క్రేజ్ ఉంటుంది. అతి తక్కువ కాలంలో స్టార్ హీరో అయిపోయిన హీరో నానీ. దీనితో అతనితో సినిమాలు చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు గత ఆరేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. నానీ మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అతని సినిమాల మీద జనాలకు ఆసక్తి కూడా ఎక్కువగానే ఉంది. దీనితో నానీ జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేయడం మనం చూస్తున్నాం. అయితే ఈ మధ్య అతని క్రేజ్ కాస్త తగ్గింది అనే చెప్పుకోవచ్చు. 

 

దానికి కారణం అతను చేసే సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అవ్వడమే. దాదాపు మూడేళ్ళ నుంచి నానీ కెరీర్ లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా మంచి హిట్ కొట్టలేదు అనే చెప్పవచ్చు. దానికి తోడు కొన్ని కథల్లో అతను ఎక్కువగా వేలు పెట్టడ౦ కూడా ఇబ్బంది పెట్టే పరిణామంగా చెప్పుకోవచ్చు. అనవసరంగా కథ అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ సలహాలు ఇవ్వడంతో అతనితో సినిమాలు చేసే దర్శకులు కాస్త చికాకు పడే పరిస్థితి ఏర్పడింది అనే చెప్పవచ్చు. ఇది పక్కన పెడితే ఇప్పుడు నానీ విలన్ గా ఒక సినిమా చేస్తున్నాడు. 

 

సినిమా మీద నానీ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అతని సినిమాల మీద ఆసక్తి చూపించే ప్రేక్షకులు కూడా నానీ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం అతని క్రేజ్ ఇంకా పడిపోయే అవకాశం ఉంది. దీనితో నానీ కూడా ఈ సినిమా కోసం చాలానే కష్టపడుతున్నాడు అనే విషయం స్పష్టంగా జనాలకు కూడా అర్ధమవుతుంది. అతని కోసం దర్శకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా నానీ కి ఎంత వరకు కలిసి వస్తుంది అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: