ఇండియన్ సినిమాలో ఇప్పుడు యువ హీరోల హవా బాగానే ఉంది. చిన్న చిన్న దర్శకులు, నిర్మాతలు చిన్న హీరోలతో సినిమా చేసి మంచి హిట్స్ కొడుతున్నారు. దీనితో ప్రేక్షకులు కూడా చిన్న హీరోల సినిమా ల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఈ మధ్య కాలంలో. ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో చిన్న హీరోలకు ప్రాధాన్యత పెరిగింది. టాలీవుడ్ లో కొందరు కీలక దర్శకులు కూడా ఈ మధ్య చిన్న హీరోలతో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అవి హిట్ కూడా అవ్వడంతో డిమాండ్ పెరిగింది. 

 

అయితే కొన్ని రోజుల నుంచి ట్రెండ్ బాగా మారింది అంటున్నారు. అగ్ర హీరోలతో సినిమాలు చేయడానికి కొందరు దర్శకులు చిన్న హీరోలను పక్కన పెడుతున్నారు. వాళ్ళను చులకనగా చూస్తున్నారట. గతంలో సినిమా చేస్తామని హామీ తీసుకున్నారు కొందరు హీరోలు. ఇప్పుడు వాళ్ళకు ఫోన్ చేసి సినిమా చేస్తామని అడిగినా పెద్దగా స్పందించడం లేదని అంటున్నారు. ఇటీవల శర్వానంద్ కొందరు దర్శకులతో మాట్లాడగా మహేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నా, ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తున్నా అంటూ మాట్లాడారట. మాట్లాడటం నిజమే గాని వాళ్ళు ఓకే చేసారో లేదో తెలియదు. 

 

దర్శకులు కమర్షియల్ గా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మాత్రం ఆ పరిస్థితి ఇంకోలా ఉంటుంది. వాళ్ళతో సినిమాలు చేయడానికి అగ్ర హీరోలు కూడా ఎక్కువగా పోటీ పడుతూ ఉంటారు. దీనితోనే ఇప్పుడు చిన్న హీరోలను నిర్మాతలు అసలు ఏ మాత్రం లెక్క చేయడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అటు నిర్మాతలు కూడా కమర్షియల్ పిచ్చి తో చిన్న హీరోలను తక్కువ చేసి మాట్లాడే విధానం తో ఉండటం తో కొందరు హీరోలు ఇప్పుడు వాళ్ళను పక్కన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీని పై కొందరు హీరోలు పైకి చెప్పలేని విధంగా ఇబ్బందులు పడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: