ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా వైరస్ పై ఇప్పుడు సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  ప్రస్తుతం ఈ కరోనా భారత దేశంలో కూడా వ్యాపిస్తుంది. ఇప్పటికే కరోనా బారిన పడ్డారు ముగ్గురు మరణించారు.  128 కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది. ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారికే ఈ కరోనా ఎఫెక్ట్ పడుతున్న విషయం తెలిసిందే.  కరోనా కు ఇప్పటి వరకు మందు కనిపెట్టలేదు.. కేవలం జాగ్రత్తలు మాత్రమే తీసుకోవాలని.. ఒకవేళ కరోనా లక్షణాలు తుమ్ములు, దగ్గు, జ్వరం లాంటిది ఏదైనా వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.  మరోవైపు కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సినీ ప్రముఖులు వీడియోల ద్వారా సోషల్ మీడియాలో సందేశాలు ఇస్తున్నారు.  ఇప్పటికే కరోనాపై బాలీవుడ్,కోలీవుడ్, టాలీవుడ్ తారలు తమ సందేశాలను వ్యక్తం చేశారు.

 

 

కరోనా వైరస్ దరి చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఓ వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కరోనా మహమ్మారి గురించి విలక్షణ నటులు మంచు మోహన్ బాబు స్పందించారు. పంచభూతాలు మనకు ఇచ్చిన వరాలను మనమే శాపాలుగా మార్చుకుంటున్నాం. ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాం. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాం.. అందుకే ఈ కరోనా వ్యాధి ఒక దేశము నుంచి మరో దేశానికి గాలి కంటే వేగంగా ప్రయాణిస్తోంది' అని తెలిపారు.  

 

 

కరోనా గురించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.. గుంపులుగా ఉన్న ప్రదేశాలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండేలా ప్రయత్నించాలి.  ప్రభుత్వాలు ఇప్పటికే మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి.  అంతే కాదు ఈ ఏడాది మార్చి 19న జరగాల్సిన శ్రీ విద్యా నికేతన్ పాఠశాల, కళాశాలల వార్షికోత్సవాన్ని, అదే రోజున జరుపుకుంటున్న నా పుట్టిన రోజు వేడుకలను వాయిదా వేస్తున్నాను' అని తెలిపారు.  కరోనాను అరికట్టే బాధ్యత మనపై ఉంది.. దాన్ని అందరికీ తెలిసేలా జాగ్రత్తలు సూచించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: