కరోనా దెబ్బకు అన్ని రంగాలు అతాలకుతలం అవుతున్నాయి. కులం మతం ధనిక పేద అనే వివక్షతలు లేకుండా కరోనా అందరితోను ఒక ఆట ఆడుకుంటోంది. సామాన్యులు మొదలుకొని సినీ రాజకీయ క్రీడ రంగాలకు చెందిన అందరు కరోనా పేరు చెపితే భయపడుతున్నారు.  


కరోనా ఎఫెక్ట్‌తో సినీరంగం చాలా నష్టపోవడమే కాకుండా కేవలం దక్షిణాది సినిమా రంగానికే కరోనా వల్ల రెండువేల కోట్ల నష్టం వస్తుంది అన్న అంచనాలు వేస్తున్నారు.   కరోనా సమస్యతో షూటింగ్స్ రద్దవడంతో పాటు సినిమాల విడుదల తేదీలు మారడంతో భారీ సినిమాల నిర్మాతల దగ్గర నుండి చిన్న సినిమాల నిర్మాతల వరకు భారీగా నష్ట బోతున్నారు.  


ఇలాంటి పరిస్థితులలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కరోనా ధాటికి తన ఆఫీస్‌ ను క్లోజ్ చేశాడు. కరోనా మహమ్మారి నుండి తన ఆఫీస్ స్టాఫ్‌ ను కాపాడుకునేందుకు ప్రస్తుతానికి తనఆఫీసు క్లోజ్ చేస్తున్నానని ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటించి జాగ్రత్తగా ఉండాలనీ ఈ కరోనా చేస్తోన్న దాడిని అందరం కలసికట్టుగా పోరాడి ఓడించాలనీ కోరుతూ ఒక ప్రకటనను ఛార్మీతో కలిసి విడుదల చేసాడు.   


ఈ ప్రకటనను నిర్మాత ఛార్మి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం పూరి  ముంబాయిలో విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఆఫీస్ క్లోజ్ చేయడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యనే ఈసినిమాకు సంబంధించి పూరి 40 రోజుల భారీ షెడ్యూల్ పూర్తి చేసిన టీమ్ ఇటీవలే హైదరాబాద్ చేరుకుంది. విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించి హైదరాబాద్ లో త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభం కావలసి ఉంది. ఇప్పుడు కరోనా అఫెక్ట్ తో ఇలా పూరి తన ఆఫీస్ క్లోజ్ చేయడమే కాకుండా అంత క్లోజ్ అంటూ ప్రకటన ఇవ్వడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: