తెలుగు ఇండస్ట్రీలో అతి కొద్ది మంది లక్కీ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకరని చెప్పుకోవొచ్చు.  అష్టా చమ్మ చిత్రంతో హీరోగా ప్రస్థఆనం మొదలు పెట్టిన నాని తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో అదృష్టం పూర్తిగా మారిపోయింది. నటించిన ఆరు చిత్రాలు వరుస విజయాలు సాధించడతో ఇండస్ట్రీలో ఈ హీరోకి ప్రత్యేక ఇమేజ్ వచ్చిపడింది. అయితే నాని ఎప్పుడు తన దర్శకులు టచ్ లోనే ఉంటుంటారు.  అలా ఇంద్రగంటితో చేసిన నాని, శివ నిర్వాణతోను కలిసి చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'నిన్నుకోరి' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందువలన శివ నిర్వాణతో మరో చేయడానికి నాని అంగీకరించాడు.

 

 ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నానికి మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయతో చిత్రాలు తీయడానికి దర్శక, నిర్మాతలు కూడా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.  ఈ నేపథ్యంలో నాని... శివ నిర్వాణతో ‘టక్ జగదీశ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో  నాని ఫ్రెంచ్ కట్ తో .. డిఫరెంట్ లుక్ తో చాలా స్టైలీష్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఇంతవరకూ ఆయన చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు.

 

ఈ మద్య హీరోలు రొటీన్ లుక్ కాకుండా కొత్తగా ట్రై చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం ఏప్రిల్ 2వ వారం నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం నాజర్, రావు రమేశ్, మురళీ శర్మ వంటి వారు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా నాని తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: