ఒకప్పటి విలన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్  విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్. అయిన తెలుగు,తమిళ్, కన్నడ, మరాఠీ, ఒరియా, హిందీ, పంజాబీ, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ నటించారు.  రాజ్ కుమార్ సినీ జీవితంలో జరిగిన సంఘటనలు, అయన అనుభవాలు కొన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.  అయన పదేళ్ల ముందే నాలుగువేలకు పైగా సినిమాల్లో నటించరట . అయితే అయన  కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.అయన మాటల్లోనే విందాం.   నేను ఇన్ని భాషల్లో నటించినప్పటికీ చాలా కంఫర్ట్‌గా అనిపించింది మాత్రం తెలుగులోనే. కాని పేరు తెచ్చిన సినిమా వియత్నాం కాలనీ అనే మళయాలం సినిమా. మోహన్ లాల్ ఈ సినిమాలో హీరో. 

 

 


ఆ సినిమాలో సూపర్ స్టార్ నటించినప్పటికీ కూడా.. నాకోసం 250 రోజులు ఆడింది. దీంతో మోహన్ లాల్ తన డైరీలో నా జీవితంలో పరమ చెత్త సినిమా ఇదే అంటూ రాసుకున్నారు. సినిమా పెద్ద హిట్ అయినది కానీ అయన మాత్రం చెత్త సినిమా అని ఎందుకు రాసుకున్నాడో అర్థంకాలేదు.  సినిమాలో ఆయనకన్నా నా పాత్రకి ఎక్కువ మార్కులు పడ్డాయి. కేవలం మోహన్ లాల్ నాతో కలిసి నటించను  అనడం  వల్ల నాకు దాదాపు 15 సినిమాల్లో నటించే అవకాశం పోయిందని తెలిపారు. 

 

 

 

అలాగే ఇప్పుడు కులం పిచ్చి చాలా ఎక్కువగా ఉంది. కులమే రాజ్యమేలుతుందని సంచలన వ్యాఖ్యలు చేసారు.  మనమంతా ఒక్కటే, మనుషులం అనే భావన మర్చిపోయారు. సమాజంలో కులమే స్టాటస్ సింబల్. అక్కడ ఇక్కడని కాదు.. ఎక్కడైనా ఈ కులమే రాజ్యమేలుతోంది. రాజ్యాధినేతల్ని ఎన్నుకునేది ఈ కుల రాజకీయాలే. ప్రధాని మంత్రి మొదలు పంచాయితీ బోర్డ్ మెంబర్‌ వరకూ ఈ కులం కంపులో తేలనిదే నాయకుడు కాలేడు.  పేర్లు పెట్టి పిలుచుకునే సంస్కృతిపోయి.. జగన్ రెడ్డి, పవన్ నాయుడు అంటూ నీచ కుల రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇక రాజకీయాల్లో పక్కనపెట్టేస్తే స్కూల్, కాలేజ్, ఆఫీస్ ల్లో కూడా కులానిదే మొదట చేయి. అయితే ఇక్కడే కాదు రంగుల ప్రపంచం   సినిమా రంగంలో కూడా ఈ కులనికి  అగ్రపీఠమే అంటున్నారు సీనియర్ నటుడు విజయ్ రంగరాజువిజయ రంగరాజు  సినిమాల్లో నిలదొక్కుకున్న తరువాత ఓ పెద్దాయన.. ‘సార్!! మీతో ఎప్పటి నుంచో మాట్లాడాలని అనుకుంటున్నాను.. మీరు చౌదరీనా?? అని అడిగాడు. అవును సార్.. అని నేను చెప్పడంతో.. అయ్యో!! మీ పేరు చివర్లో రాజు అని ఉండటంతో మీరు రాజులేమో అనుకుని కో డైరెక్టర్‌గా నేను నాలుగైదు సినిమాల్లో కట్ చేశా అన్నాడు. నేను చౌదరి సార్.. మీరుకూడా చౌదరి అని తెలిసి ఉంటే. నా ఆరు సినిమాల్లో మీరు ఉండేవారు అన్నాడు. 

 

 


ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారని నాకు తెలుసు కాని. ఇది నాకు ప్రత్యక్ష అనుభవం. నాలాగే చాలా మంది ఇండస్ట్రీలో ఉండేవారు. ఉన్నారు. టాలెంట్ ఉన్నాగాని నిలదొక్కుకోనివ్వరు. కులం అనే మాట వల్ల ప్రతిభ ఉన్నాగాని రాణించలేకపోతున్నారు.  పుట్టినప్పటినుండి కుల పిచ్చి ఉంది.. ఇప్పుడే కాదు.. ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి కులం అనేది కీ రోల్. ఒక్కొక్క ఫీల్డ్‌లో ఒక్కో కులాన్ని ఆధిపత్యం. సంగీతం తీసుకుంటే.. మొత్తం బ్రాహ్మణులే ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాళ్లే ఉంటారు. వాళ్ల దగ్గర అసిస్టెంట్లుగా జాయిన్ కావాలన్నా ముఖ్యంగా కావాల్సింది కులం. నేను మ్యూజిక్ నేర్చుకుంటా నేర్పిండని వెళ్తే.. భుజం మీద చేయి వేసి జంజ్యం వెతికేవారట. ఇవన్నీ సినిమా ఇండస్ట్రీ స్టార్టింగ్ చాలా ఉండేవి.ఇక స్టుడియో యజమానులు అందరూ రెడ్లు. ప్రొడ్యుసర్స్, యాక్టర్స్ చౌదరీలు ఉన్నారు. మెల్లమెల్లగా రాజులు రావడం మొదలుపెట్టారు. ఇలా ఒకో తరానికి ఒక్కో సెటప్. 

 

ఇప్పుడు కాపు యుగం నడుస్తుంది. ఇప్పుడు ఆ కులానికి సంబంధించి ఎంత మంది ఉన్నారు.. వేరే కులాల్లో ఎంత మంది ఉన్నారు. ఏ కులంలో హీరోలులేరు. ఇవన్నీ జనానికి తెలిసిన విషయాలే. మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కులం లేనిదే ఇండస్ట్రీలో ఉండటం అనేది జరగనిపని. నీకు ఎంత టాలెంట్ ఉన్నా. కులమే ప్రధానం. రజినీకాంత్ గారితో మంచి అనుభందం ఉందని, పార్టీలలో మందు తాగడం నేర్పించింది రజనీకాంత్ గారేనని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: