కరోనా వైరస్. ఇపుడు ఎక్కడ చూసిన అదే మాట. కరోనా వైరస్ ప్రాణాంతకమని అందరూ ఆ మాట అనడానికే భ‌యపడుతున్నారు. ఆ ఊసు వింటే జడుసుకుంటున్నారు. పేదా పెద్ద, గొప్పా, బీద అన్న మాట లేకుండా కరోనా అందరికీ ఒకేలా క్రూర చూపు చూస్తోంది.

 

దాంతో సినిమా రంగం పెద్దలు కూడా కొన్నాళ్ళు షూటింగులు ఆపుచేసుకుంటున్నారు. అయితే బెల్లంకొండ సురేష్ మూవీ అల్లుడు అదుర్స్ షూటింగ్ మాత్రం నిరాటంకంగా సాగుతోందిట. కాల్షీట్ల ప్రాబ్లం వల్ల ఈ షూటింగ్ జరుపుకునేందుకు బెల్లంకొండ పర్మిషన్ తెచ్చుకున్నారని టాక్.

 

ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన హీరోయిన్ గా నభా నటేష్ నటిస్తోంది. ఈ అమ్మడు కన్నడ ముద్దు గుమ్మ. కరోనా భయం ఓ వైపు ఉంది. కన్నడ సీమలో కూడా కరోనా గట్టిగానే ఉనికి చాటుకుంది. ఈ నేపధ్యంలో హైదరాబద్ కి షూటింగ్ పేరు మీద చక్కర్లు కొడుతోంది ఈ అమ్మడు.

 

కరోనా అంటే భయం లేకుండా నభా షూటింగ్ చేయడం చూసిన వారు ముచ్చట పడుతున్నారుట. నభా నాకేంటి అన్నట్లుగా కరోనానే సవాల్ చేస్తూ షూటింగ్ చకచకా చేస్తోందిట. ఆమె స్పిరిట్ చూసిన వారు గ్రేట్ అంటున్నారు.

మొత్తానికి ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా నభా నటేష్ అందాలకు దాసోహం అందో లేక ఈ అమ్మడే దానికి కన్ను కొట్టి పక్కకు పొమ్మంటుందో తెలియదు కానీ నభయం నఫియర్  అంటోంది నభా నటేష్.

 

ఇస్తార్ట్ శంకర్ హిట్ తో మంచి ఊపు మీద ఉన్న నభా నటేష్ అల్లుడు అదుర్స్ మూవీలో కూడా తనదైన మసాలాను జోడిస్తోందిట. ఈ మూవీని సమ్మర్ కి అనుకున్న  టైం కి తీసుకురావాలని కూడా నిర్మాత బెల్లంకొండ సురేష్ భావిస్తున్నాడు. దాంతో ఆయనకు సహకరిస్తూ మంచి మార్కులనే నభా నటేష్ కొట్టేసిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: