కొరటా శివ ఇండస్ట్రీలో సక్సస్ ఫుల్ డైరెక్టర్. అందులో ఏమాత్రం సందేహం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత ఇండస్ట్రీలో అంతటి పేరు సంపాదించుకున్నారు. అందుకు కారణం రాజమౌళి మాదిరిగానే వరుసగా హిట్స్ తప్ప ఇప్పటి వరకు కొరటాల కెరీర్ లో ఫ్లాప్ అన్నది లేదు. ప్రభాస్ తో ఆయన తీసిన మిర్చి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో శ్రీమంతుడు, తారక్ తో జనతా గ్యారేజ్, మళ్ళీ మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన వసూళ్ళని రాబట్టి ఇండస్ట్రీ రికార్డ్స్ ని సాధించాయి. దాంతో కొరటా కి ఇండస్ట్రీలో విపరీతమీన క్రేజ్ ని దక్కించుకున్నారు.

 

అయితే ఈ సక్సస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ తో ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే లకికీ ఛాన్స్ ని అందుకున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ళు ఎదురు చూశాడు. చిరంజీవి సైరా తో బిజిగా ఉండటంతో కొరటాలకి ఇలా రెండేళ్ళు వేయిట్ చేయడం తప్పలేదు. అయితే సైరా కంప్లీటయి కొరటాల చిరు సినిమా మొదలైంది. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. సజావుగా షూటింగ్ సాగడం లేదు. లెక్క ప్రకారం ఇప్పటికే సినిమా కంప్లీటయి రిలీజవ్వాల్సింది. కానీ ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ షూటింగ్ ఆపేశారు. అయితే ఈ సారి వచ్చిన అడ్డంకి కరోనా వైరస్. 

 

ప్రస్తుతం కరోనాతో బారత దేశం తో పాటు ఇతర దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల జనాలు ప్రణాలు విడుస్తున్నారు. అయితే మన దగ్గర ఆ ప్రభావం చాలా తక్కువగా ఉండటం అదృష్ఠం అని చెప్పాలి. అందుకే ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కరోనా బారి నుండి సురక్షితంగా ఉండటానికి మార్చ్ 31 వరకు అంతటా బంద్ ప్రకటించారు. సినిమా హాల్స్, ఇండస్ట్రీస్, కంపెనీస్, స్కూల్స్, కాలేజస్ ..ఇలా జన సందోహం ఎక్క్వగా ఉన్న అన్ని ప్రదేశాలు మూవి వేయాలని ఆదేశించారు. దాంతో సినిమా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఆ ఎఫెక్ట్ కొరటాల సినిమా మీద బాగా పడింది. ఇప్పుడు ఈ విషయంలో కొరటాల డిసప్పాయింట్ అవుతున్నారట. కానీ తప్పదు కదా అంటూ మళ్ళీ కన్విన్స్ అయినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: