`అలీతో సరదాగా` కార్య‌క్ర‌మం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే మోస్ట్ ఎంటర్టైనింగ్ షోలలో ఆలీతో సరదాగా కూడా ఒకటి.  ప్రముఖ కమెడియన్ ఆలీ హోస్ట్ చేస్తోన్న ఈ షోలో హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు వ‌స్తుంటారు. వారితో సరదా సరదా ముచ్చట్లలో ముంచెత్తుతూ వారివారి వ్యక్తిగత విషయాలు, జీవితంలోని ఆసక్తికర సంఘటనల గురించి రాబడుతుంటాడు ఆలీ. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ షోలో యాంక‌ర్ ప్ర‌దీప్ వ‌చ్చి ఎంతో సంద‌డి చేసి.. ఎన్నో విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు.

 

ఇక తాజాగా ప్ర‌సారం కాబోయే ఎపిసోడ్‌లో టాలీవుడ్ కు చెందిన మరో యంగ్ హీరో సుధీర్ బాబు స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయం అయ్యాడు ఈ యంగ్ హీరో సుధీర్‌ బాబు. రెగ్యులర్‌ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న నానితో క‌లిసి ఓ మల్టీస్టారర్ సినిమా సినిమా చేస్తున్నాడు. krishna INDRAGANTI' target='_blank' title='ఇంద్రగంటి మోహనకృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వి అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.

 

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్ రాజు,శిరీష్‌, హర్షిత్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో పోలీసు ఆఫిసర్‌గా సుధీర్‌ బాబు.. నెగటీవ్‌ షేడ్స్‌ ఉన్న రాక్షసుడు పాత్రలో నాని కనిపించనున్నారు. అయితే ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా అలీతో సరదాగా షోకు వ‌చ్చిన సుధీర్ బాబు ఎన్నో విష‌యాలు బ‌య‌ట పెట్టారు. ఆ క్ర‌మంలోనే తాను మరియు దిల్ రాజులు ప్రభాస్ తో ఓ సినిమా అనుకున్నామని అలా అనుకోని రెండో రోజే డబ్బులు ఇచ్చేద్దామని అనుకునే లోపే ప్రభాస్సినిమా నుంచి తప్పుకోవడం దానిని బన్నీ చెయ్యడం జరిగాయని సుధీర్ బాబు తెలిపాడు. మరి ప్రభాస్ వ‌దిలేసి బన్నీ చేసిన సినిమా ఏంటీ అన్న‌ది తెలియాలి అంటే మార్చ్ 23 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: