ప్రస్తుతం టాప్ హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో సూపర్ స్టార్ల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  ఈ నేపథ్యంలో మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  మాలీవుడ్ లోనే కాదు తెలుగు లో కూడా తన సత్తా చాటుతున్నాడు.  ఆ మద్య నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ చిత్రంలో జెమిని గణేషన్ పాత్రలో నటించాడు.   చెన్నైకు చెందిన ఆర్కిటెక్ట్ అమల్ సూఫియాను 2011 డిసెంబరు 22న వివాహం చేసుకున్నారు.

 

తెలుగులో దుల్కర్ పిల్ల రాక్షసి, 100 డేస్ ఆఫ్ లవ్, హేయ్ పిల్లగాడ, అందమైన జీవితం, జనతా హోటల్, మహానటి  వంటి చిత్రాల్లో నటించాడు. కొంతకాలంగా నేరుగా మరో తెలుగు సినిమా చేయాలని ఆయన ఆశ పడుతున్నాడు. అలాంటి దుల్కర్ సల్మాన్ ముచ్చట తీరిపోయిందనీ, త్వరలో ఆయన ఓ తెలుగు సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో అందాల రాక్షసి తర్వాత నాని హీరోగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు.  ఆ తర్వాత ఈ డైరెక్టర్ కాస్త సైలెంట్ అయినా.. శర్వానంద్ తో పడి పడి లేచే మనసు తో మరో డిజాస్టర్ అందుకున్నాడు. 

 

హను రాఘవపూడి, ఇటీవల దుల్కర్ సల్మాన్ ను కలిసి ఒక కథను వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇద్దరి మధ్య కథాపరమైన చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి, సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నారట.  మరి ఈ మాలీవుడ్ లో హీరో డైరెక్ట్ గా తెలుగు లో నటించి మంచి హిట్ అందుకుంటే మాత్రం ఇక్కడ కొంత కాలం లైఫ్ ఉన్నట్లే అంటున్నారు.   ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ,  మలయాళ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: