టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒక వెలుగు వెలిగిన హీరో శోభన్ బాబు. దాదాపు మూడు, నాలుగు దశాబ్దాల పాటు ఆయన టాలీవుడ్ ప్రేక్షకులను తన అందంతో నటనతో అలరించారు. టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చినా సరే ఆయన స్థాయిలో సోగ్గాడు అనిపించుకోలేదు ఎవరూ కూడా. ఆయన చేసిన చాలా సినిమాలు అమ్మాయిలకు దగ్గరయ్యాయి. ముఖ్యంగా సోగ్గాడు సినిమాలో ఆయన పంచకట్టు ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా ఆయన ఆ సినిమాలో ఎంతో అందంగా కనిపించారని ఆయన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని అప్పట్లో ప్రేమ లేఖలు కూడా ఆయనకు రాసిన సందర్భాలు ఉన్నాయి. 

 

ఆయనకు అలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. దేవత సినిమాలో శోభన్ బాబు ఎంతో ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో ఆయన ఇద్దరు హీరోయిన్లతో రోమాన్స్ చేసారు. ఆ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అనే చెప్పుకోవచ్చు. అగ్ర హీరోగా ఆయనకు ఆ సినిమా తెచ్చిన గుర్తింపు గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా చాలా సినిమాల్లో ఆయన సోగ్గాడు అనిపించుకున్నారు. ఎంత మంది లవర్ బాయ్స్ వచ్చినా సరే శోభన్ బాబు స్థానం ఆయనదే. 

 

ఆయన మరణించి పదేళ్ళకు పైగా అయినా సరే... ఆయన సినిమా వస్తే అప్పటి మహిళా ప్రేక్షకులు... అలా చూస్తుండిపోతారు. ఆ విధంగా ఆయన ఆకట్టుకున్నారు అప్పట్లో. ఇక ఆయన సినిమాల్లో చాలా వరకు అమ్మాయిలకు దగ్గరైనవే ఉన్నాయి అనేది వాస్తవం. ఆయన సినిమాలు అన్నీ కూడా మహిళా ప్రేక్షకుల కోసం తీసినవే అన్నట్టు ఉండేవి. ఏవండి ఆవిడోచ్చింది అనే సినిమాలో ఆయన వయసు మీద పడినా సరే... తన అందంతో అలరించారు. అప్పుడు కూడా ఆయన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిలూ ఉన్నారు అంటే ఆయన ఏ స్థాయిలో అలరించారో చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: