తమిళ స్టార్ హీరో విజయ్ -ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం మాస్టర్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇక ఈచిత్రంలో విజయ్ పాత్ర తాలూకు వివరాలు బయటికి వచ్చాయి. ఈసినిమాలో విజయ్ ,జాన్ దొరైరాజ్ పేరుతో సెయింట్ జెఫరీస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో ప్రొఫెసర్ పాత్రలో స్టూడెంట్స్ కు డీన్ గా కనిపించనున్నాడు.
 
ఇటీవల విడుదలైన ఓ స్టిల్ లో విజయ్ ఐడి కార్డును ధరించి కనిపించడం తో తన పాత్ర వివరాలు బయటికి వచ్చాయి. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మక్కల్ సెల్వన్  విజయ్ సేతుపతి విలన్ గా నటించగా పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది. వీరితోపాటు ఆండ్రియా ,శంతన్ భాగ్యరాజ్,అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో ఎక్స్ బి క్రియేటర్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. 
 
ఇదిలావుంటే ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 9న విడుదలచేద్దాం అనుకున్నారు కానీ ప్రస్తుతం కరోనా వల్ల రిలీజ్ డేట్ ను మార్చే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తుంది. అన్నికుదిరితే ఏప్రిల్ చివర్లో కానీ మే మొదటి వారంలో కానీ మాస్టర్ విడుదలకానుంది.  ఇక మాస్టర్ తెలుగు లో కూడా విడుదలకానుందని తెలిసిందే ఇటీవలే తెలుగు వెర్షన్  కు సంబంధించిన విజయ్ ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు. మహేష్ కోనేరు ఈచిత్రాన్ని తెలుగులో విడుదలచేస్తుండగా సర్కార్, విజిల్ తో విజయ్ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టడం తో మాస్టర్ పై తెలుగు లో కూడా భారీ అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: