అక్కినేని నాగ చైతన్య... మొదటి సినిమా నుంచే లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో. రెండో సినిమామాయ చేసావే అంటూ అతను నటన ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా ద్వారా అతను కొందరు దర్శకులకు కూడా దగ్గరయ్యాడు. అతనితో సినిమాలు చెయ్యాలి అనుకుని ప్రత్యేకంగా కథలు రాసుకున్న వాళ్ళు ఉన్నారు. అతను చేసిన ఆటో నగర్ సూర్యా సహా కొన్ని సినిమాలు లవర్ బాయ్ గా కాస్త యాంగ్రీ యంగ్ మాన్ గా కూడా గుర్తింపు తెచ్చిపెట్టాయి అనేది వాస్తవం. 

 

నాగార్జున కొడుకు అయినా సరే అతను మాత్రం తన సినిమాల ద్వారానే గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసాడు. అతను చేసిన సినిమాలు అన్నీ కూడా... టాలీవుడ్ లో ఒక లవ్ సినిమాలు గానే వచ్చాయి. మొదటి సినిమా అంతగా అతనికి హెల్ప్ అవ్వకపోయినా ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం మంచి గుర్తింపే తెచ్చాయి. ఎక్కువ సినిమాల్లో అతను లవ్ ఫెయిల్ అయిన హీరోగానే నటించాడు. ఈ మధ్య కాలంలో అతను మజిలీ, యుద్ధం శరణం సినిమాలు కూడా లవ్ ని బాగానే పండించాయి అని చెప్పవచ్చు. 

 

ఇప్పుడు సాయి పల్లవి హీరోయిన్ గా మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ప్రేమ కథగానే వస్తుంది. అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకోకపోయినా ఎక్కువ ఫ్లాపులు లేని హీరోగా అతను నిలబడ్డాడు. కథలో భిన్నంగా ఉండే కోణాలు చూసుకుని తన పాత్రకు అవి దగ్గరగా ఉండేలా చూసుకుంటూ సినిమాలు చేస్తూ ఉంటాడు. హీరో అంటే ఇలాగే ఉండాలి అనే తత్వ౦ కాదు అతనిది. అందుకే అతని సినిమాలకు ప్రేక్షకులు ఫిదా అవుతూ ఉంటారు. అతని సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయినా సరే క్రేజ్ మాత్రం తగ్గలేదు. తండ్రి ఇమేజ్ తో సంబంధం లేకుండా సినిమా చేస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: