సూపర్ స్టార్ మహేష్ బాబు... నాలుగు పదుల వయసు దాటినా సరే మహేష్ బాబు తన గ్లామర్ తో అలరిస్తూనే ఉన్నాడు. అతి తక్కువ కాలంలో చేసినవి తక్కువ సినిమాలే అయినా సరే అతను లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రేమకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎక్కువగా చేసాడు. అతని కెరీర్ లో ఎక్కువగా మనకు అవే కనపడతాయి. ఇప్పుడు అంటే కమర్షియల్ హీరోగా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు గాని అప్పట్లో అతను లవర్ బాయ్. తన సినిమాల ద్వారా అమ్మాయిలకు బాగా దగ్గరయ్యాడు. 

 

రాజకుమారుడు సినిమాలో అతన్ని చూసి ముట్టుకుంటే మచ్చ పడుతుంది ఏమో అన్నట్టు ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అతను చేసిన నానీ, మురారి, టక్కరి దొంగ వంటి సినిమాలు లవర్ బాయ్ గా గుర్తింపు తీసుకొచ్చాయి. తండ్రి కృష్ణ కంటే అందంగా ఉన్నాడని అతని తండ్రి తరం వాళ్ళు కూడా అన్నారు. ఆ విధంగా మహేష్ బాబు తన అందంతో ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ లో మహేష్ బాబుని మించిన అందగాడు ఇప్పుడు లేడు, అప్పుడు లేడు అంటూ అమ్మాయిలూ కామెంట్లు చేస్తూ ఉంటారు. అతన్ని చూడటానికి సినిమాకు వెళ్ళే వారు. 

 

క్లీన్ షేవ్ అతను ఆ విధంగా ఆకట్టుకున్నాడు అప్పట్లో. టాలీవుడ్ లో మహేష్ సినిమా అనగానే ఎక్కువగా టికెట్లు కొనేది అమ్మాయిలే. అతని సినిమాలు చూసి అతని ఫోటోలు ఫోన్ లో పెట్టుకుని భర్తల చేత తిట్లు తిన్న భార్యలు, తండ్రులు చేత తిట్లు తిన్న కూతుళ్ళు ఎందరో ఉన్నారు. ఆ విధంగా మహేష్ బాబు అలరించాడు. పోకిరి సినిమాలో అతను గ్లామర్ బాయ్ గా యాక్షన్ హీరోగా అలరించాడు. ఆ సినిమా తర్వాత వచ్చిన అతడు సినిమాలో కూడా గ్లామర్ తో ఆకట్టుకున్నాడు. అయితే అతిధి సినిమా మాత్రం అతని ఇమేజ్ ని కాస్త దెబ్బ తీసింది అనే చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: