టాలీవుడ్ లో నితిన్ గురించి కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కెరీర్ మొదట్లో అతను చేసిన సినిమాలు మధ్యలో అతను చేసిన సినిమాలు అతనికి ఏ విధంగా గుర్తింపు తీసుకోచ్చాయో తెలియదు గాని లవర్ బాయ్ గా మాత్రం అమ్మాయిలకు దగ్గర చేసాయి అనేది వాస్తవం. జయం సినిమా ద్వారా అతను టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో అతను బొద్దు బొద్దు గా ముద్దు ముద్దు గా కనపడటం తో అమ్మాయిలు అతని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఉదయ్ కిరణ్, నితిన్, తరుణ్ ఇలా అందరూ ఒకే సమయంలో హీరోలు అయిన వాళ్ళే. 

 

ముగ్గురికి తక్కువ కాలంలో ఒకే రకమైన గుర్తింపు వచ్చింది. అయితే కెరీర్ లో ముగ్గురు ఇబ్బందులు పడ్డారు. కథలు ఎంపిక చేసుకోవడం రాక ఒకరు, పగతో ఒకరు, ప్రేమ వ్యవహారాలతో కెరీర్ లో ఇబ్బందులు పడ్డారు. అయితే నితిన్ మాత్రం ఫ్లాప్ సినిమాలు వచ్చినా సరే నిలబడ్డాడు అనే చెప్పుకోవాలి. అతని కెరీర్ లో చూస్తే గత ఆరేళ్ళ క్రితం వరకు అన్నీ ఫ్లాప్ సినిమాలే. ఆ తర్వాత అతను ఇష్క్ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించాడు నితిన్. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మనోడు మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు. 

 

ఆ తర్వాతి నుంచి జాగ్రత్తగా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. అంతకు ముందు వరకు అతనికి మాస్ హీరో గా గుర్తింపు ఉండేది. కాని ఆ సినిమా ద్వారా అతను క్లాస్ హీరో అయిపోయాడు. ఇప్పుడు అతని సినిమాలు అన్నీ ప్రేమ కథల ఆధారంగానే ఉంటున్నాయి. ఇటీవల వచ్చిన భీష్మ సినిమా కూడా ప్రేమ కథ ఆధారంగా వచ్చిందే. ఇప్పుడు రాబోయే సినిమాలను కూడా అలాగే చేద్దాం అనుకునే అనుకుంటున్నాడు. కాని జాగ్రత్తగా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: