టాలీవుడ్ యంగ్ హీరోస్ లో రామ్ ఒకడు. తక్కువ కాలంలో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో అతను ఒకడు. దేవదాస్ అనే సినిమాతో అమ్మాయిలను తన వైపుకి తిప్పుకున్నాడు రామ్. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అక్కడి నుంచి అతను చేసిన సినిమాలు ఎక్కువగా లవ్ బేస్ తోనే ఉన్నాయి. జగడం సినిమా అతని కెరీర్ లో మంచి హిట్ ఇవ్వకపోయినా అందులో అతను బాగా ఆకట్టుకున్నాడు. లేత లేత గా కనపడుతూ అమ్మాయిలకు బాగా దగ్గరయ్యాడు. అతను ఓకే అంటే ఇంట్లో నుంచి వెళ్లి అయినా పెళ్లి చేసుకుంటా అనే వారు అమ్మాయిలు. 

 

ఆ విధంగా రామ్ గుర్తింపు తెచ్చుకున్నాడు అనేది వాస్తవం. ఆ తర్వాత అతను ఎన్నో లవ్ స్టోరీ సినిమాలు చేసాడు. ఆ సినిమాల్లో హిట్ ఫ్లాప్ తో సంబంధ౦ లేకుండా అతని కోసం చూసారు అమ్మాయిలు. కీర్తి సురేష్ హీరోయిన్ గా వచ్చిన నేను శైలజ సినిమా అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. కెరీర్ లో ఎక్కువ ఫ్లాప్ లు చూసిన యంగ్ హీరో అతను. అతని సినిమాల్లో అతను చేసే హైపర్ యాక్టింగ్ అతనికి మైనస్ అంటూ ఉంటారు. పండగ చేస్కో సినిమాలో కూడా ప్రేమ కథ. ఇలా లవ్ స్టోరీస్ చేయడంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. 

 

ఇక ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అతను ఫాం లోకి వచ్చాడు. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత అతను ఇప్పుడు రెడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే అతని కెరీర్ గాడిలో పడినట్టే అని చెప్పుకోవచ్చు. చిన్న వయసులోనే హీరోగా వచ్చాడు రామ్. అయినా సరే ఆశించిన స్థాయిలో సినిమాలు హిట్ లు అవ్వకపోయినా అమ్మాయిలకు మాత్రం లవర్ బాయ్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: