సొంతం చిత్రంతో ఆర్య‌న్‌రాజేష్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించి తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన భామ బొద్దుగుమ్మ న‌మిత‌. త‌ర్వాత జెమినిలో వెంక‌టేష్ తో క‌లిసి న‌టించి మంచి పాపుల‌ర్ అయింది. ఆ త‌ర్వాత కొన్ని చిత్రాల్లో న‌టించి మెప్పించింది. అనుకోకుండా కాస్త లావు అవ్వ‌డంతో స‌డెన్‌గా కెరియ‌ర్‌లో డ‌వున్ ఫాల్ అయింది. ఆ త‌ర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకుని బాల‌కృష్ణ చిత్రంలో న‌టించింది ఈ భామ‌.

 

ఇక భారీ అందాల‌తో యువ‌త‌ని ఆక‌ట్టుకునే అందం బొద్దుగుమ్మ న‌మిత సొంతం. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన న‌మిత గ‌త కొంత కాలంగా క్రేజ్ త‌గ్గ‌డంతో సినిమాల్లో పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. హార‌ర్ చిత్రాలు, బీ గ్రేడ్ చిత్రాల్లో న‌టిస్తోంది. అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా హాట్ ఐట‌మ్ సాంగ్‌ల్లో క‌నిపిస్తూ కుర్ర‌కారుకి మ‌త్తెక్కిస్తోంది. ఇటీవ‌ల వివాహం చేసుకున్నా వ‌రుస హాట్ ఫొటో షూట్‌ల‌తో యువ‌త‌ని రెచ్చ‌గొడుతోంది.

 

ఇక ఇదిలా ఉంటే... తాజాగా న‌మిత‌కి  ఓ నెటిజ‌న్ ఫోన్ చేసి బెదిరించ‌డం మొద‌లుపెట్టాడ‌ట‌. అదేమిటంటే... త‌ను కోరింది ఇస్తావా? లేక పోర్న్ వీడియోల‌ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయాలా అంటూ బెదిరించ‌డం మొద‌లుపెట్టాడ‌ట‌. హాటీ అంటూ ఫోన్‌లో త‌న‌ని పిలుస్తున్నాడ‌ని న‌మిత తాజాగా ఆ బ్లాక్ మెయిల‌ర్ బండారాన్ని బ‌య‌ట పెట్టింది. అయామ్ త‌మిళ సెంత‌మిళ్ అనే ఓ యువ‌కుడు త‌న‌ని వేధిస్తున్నాడ‌ని ఆమె పేర్కొంది. ఇక‌ ఇలాంటి చీప్ మైండ్ వున్న వాళ్ల‌తో స్టార్స్‌, సెల‌బ్రిటీలు జాగ్ర‌త్త‌గా వుండాల‌ని ఫొటో, అకౌంట్‌తో స‌హా ఇన్‌స్టాలో పోస్ట్ చేసయ‌డంతో ఓ బ్లాక్ మెయిల‌ర్ ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. అయితే కుదిరినంత వ‌ర‌కు హీరోయ‌న్స్ వాళ్ళ హాట్ ఫొటోస్ పెట్ట‌క‌పోవ‌డ‌మే మంచిద‌నిపిస్తుంది ఈ ఉదంతం చూస్తుంటే అయితే టాలీవుడ్‌లో న‌మిత వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలు లేవు కాని ఇలాంటి టాపిక్‌తో ఆమె ప్ర‌స్తుతం నెటిజ‌న్ల నోర్ల‌లో నాన‌డం త‌న‌కు ఎంతో బాధ‌గా ఉందంటూ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా చెబుతోంది. ఇక సెల‌బ్రెటీల ప‌రిస్థితే ఇలా ఉంటే సామాన్యులు ఇంకా చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: