శ్రీకాంత్  పేరు చెబితే తెలియని వారు ఉండరు. నటుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రేత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో శ్రీకాంత్. శ్రీకాంత్ నటించిన  మొదట సినిమా  ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్  సినిమా. ఇందులో శ్రీకాంత్  నక్సలైట్‌ నాయకుడిగా నటించాడు. అప్పట్లో ఈ సినిమాకు ఐదువేల రూపాయల పారితోషికం అందుకున్నాడట .

 

శ్రీకాంత్  మొదటి నుంచి  చిన్న చిన్న పాత్రలతో,   విలన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తర్వాత   శ్రీకాంత్ నెమ్మదిగా హీరోగా మారాడు. వన్ బై టు సినిమా  హీరోగా శ్రీకాంత్ మొట్టమొదటి సినిమా. కానీ ఆ సినిమా శ్రీకాంత్ కి పెద్ద గుర్తింపు ఇవ్వలేదు. తర్వాత  వచ్చిన తాజ్ మహల్   సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆ సినిమాలో లవర్ బాయ్ గా నటించి ప్రేక్షకుల మనసు దోచాడు. శ్రీకాంత్ నవ్వితే  వచ్చే డింపుల్ భలే అందంగా ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి ప్రేమ దక్కించుకోడం చేసిన సాహసమే తాజ్ మహల్.  సంగీత పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది.

 

ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు వరుస హిట్లు  కె. రాఘవేంద్రరావు  దర్శకత్వంలో వచ్చిన పెళ్ళి సందడి  చిత్రం కూడా మంచి విజయం సాధించింది. అల్ టైం సూపర్ సినిమా అది. తర్వాత ఆహ్వానం, ఆమె, మా ఆవిడమీదొట్టు మీ ఆవిడా చాలా మంచిది ఇలా చాలా సినిమాలు తీసి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ లవర్ బాయ్. శ్రీకాంత్ కి అప్పట్లో లేడీ ఫాన్స్ ఎక్కువ మంది ఉండేవారు  

 

తర్వాత  ఖడ్గం, ఆపరేషన్ ధుర్యోధన సినిమాల్లో ఆయన పోషించిన పాత్రకు పలువురి విమర్శకుల ప్రశంసలు లభించాయి. స్వతహాగా చిరంజీవి అభిమానియైన శ్రీకాంత్ ఆయనతో కలిసి నటించాలని ఎంతో కోరికగా ఉండేవాడు. ఆయన కోరిక శంకర్‌దాదా ఎం.బీ.బీ.ఎస్ తో తీరింది. దానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్‌దాదా జిందాబాద్ లో కూడా ఆయనతో కలిసి నటించాడు .బాలకృష్ణతో కలిసి శ్రీరామరాజ్యం సినిమాలో, వెంకటేష్తోకలిసి సంక్రాంతి, నాగార్జునతో కలిసి నిన్నే ప్రేమిస్తా, .మోహన్ బాబుతో తప్పుచేసి పప్పుకూడు, రాజేంద్ర ప్రసాద్తో సరదాగా సరదాగా మొదలయిన వాటిలో నటించాడు. జగపతిబాబుతో మనసులో మాట, జె.డి. చక్రవర్తితో ఎగిరే పావురమా, మల్టి స్టార్ సినిమాలో కూడా నటించాడు.

 

'యుద్ధం శరణం’సినిమాలో విలన్ గా నటించాడు కానీ ఆ సినిమా ఆడలేదు. విలన్ గా మళ్ళీ శ్రీకాంత్ ని ప్రేక్షకులు ఇష్టపడలేదు.  ‘విలన్‌గా కనిపించడానికి నీకు చాలా టైమ్‌ ఉంది..’ అనుకున్నారెమో మరి ప్రేక్షకులు. మనిషికి అహంకారం ఉండకూడదు. అది ఆవహిస్తే పతనం మొదలైపోతుంది అని నమ్మే వ్యక్తి శ్రీకాంత్ దాదాపు 125 సినిమాల దాక నటించాడు. 

 

 తెలుగు సినిమా నటుల సంఘం మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) లో శ్రీకాంత్ సభ్యుడిగా పని చేశాడు. ఇంకా వ్యక్తిగత జీవితానికి వస్తే l సినిమా నటి ఊహను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రోహన్, రోషన్, మేధ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు నిర్మల కాన్వెంట్ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: