చిరంజీవి కొరటాల శివల మూవీ ‘ఆచార్య’ ను ఎలాగైనా ఆగస్టు 14న విడుదలచేయాలన్న చిరంజీవి సంకల్పం ఇక నెరవేరే అవకాశాలు లేనట్లే అన్న సంకేతాలు వస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ వాయిదా పడడంతో ఈమూవీకి ఏర్పడిన తొలి సమస్య రామ్ చరణ్ కు బదులు మహేష్ బాబును తీసుకోవాలా ? అన్న ఆలోచనలతో కొన్నిరోజులు గడిచిపోయాయి. ఆతరువాత అనేక లెక్కలు వేసుకుని రామ్ చరణ్ అన్న స్థిర నిర్ణయానికి వచ్చి రాజమౌళిని ఒప్పించి ఆగష్టులో విడుదల చేసుకోవాలి అన్నఆలోచనలు కొనసాగుతూ ఉండగానే త్రిష ఈమూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకుని మెగా కాంపౌండ్ కు ఊహించని షాక్ ఇచ్చింది.


ఇప్పుడు మెగా కాంపౌండ్ అనుష్కతో రాయబారాలు చేస్తున్నా ఆమె కూడ భారీ పారితోషికం అడుగుతున్నట్లు టాక్. ఈపరిస్థితులలో మరో హీరోయిన్ కావాలి ఆమె డేట్లు మరెవరితోనూ క్లాష్ కాకూడదు ఈపీట ముడి ఇలా కొనసాగుతూ ఉండగానే కరోనా వ్యవహారం వచ్చి పడటంతో ఈమూవీ షూటింగ్ ను వాయిదా వేసారు. ఇప్పుడు ఎదోవిధంగా అనుష్క ను ఒప్పించి వచ్చేనెల నుండి ఈమూవీ షూటింగ్ ను మొదలుపెట్టాలి అని భావించినా వచ్చేనెల మొదటి రెండువారాలు అనుష్క తన ‘నిశ్శబ్దం’ ప్రమోషన్ లో చాల బిజీగా ఉంటుంది.


ఆతరువాత అనుష్క ‘ఆచార్య’ షూటింగ్ కు వచ్చి చేరినా మిగతా ఆర్టిస్ట్ ల డేట్స్ సద్దుబాటు చేసుకుంటూ ఈమూవీని ఆగష్టు 14న విడుదల చేయడం కష్టం అని అంటున్నారు. దీనికితోడు కరోనా వ్యవహారం మరింత ముదిరి షూటింగ్ లు ఆలస్యం ‘వకీల్ సాబ్’ ను ఆగష్టు 14న విడుదల చేయాలని దిల్ రాజ్ భావిస్తున్నాడు. దీనితో ‘ఆచార్య’ ను ముందుకు జరిపి దసరా కు విడుదల చేయాలి అని భావిస్తే ఇప్పటికే యష్ ‘కేజీ ఎఫ్ 2’ ను అక్టోబర్ 23న విడుదల చేస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నాడు. 

 

దీనితో దసరా ను యష్ కు వదిలి ఆతరువాత వచ్చే దీపావళికి ‘ఆచార్య’ ను విడుదల చేయాలి అనుకుంటే తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ లేటెస్ట్ మూవీ ‘అనంత’ దీపావళి పై కన్నేసింది. ఇలాంటి పరిస్థితులలో వచ్చే సంక్రాంతి కి వద్దాము అనుకుంటే రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ఇప్పటికే తన బర్త్ ను రిజర్వ్ చేసుకుంది. దీనితో రాజమౌళిని ఒప్పించి ‘ఆచార్య’ లో చరణ్ నటించినా ఈ మూవీ విడుదలకు సరైన డేట్ దొరకకపోవడంతో దాని ప్రభావం ఈమూవీ మార్కెట్ పై ఉంటుంది అంటూ ‘ఆచార్య’ అష్టదిగ్భంధంలో చిక్కుకున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: