తెలుగు సినిమాల్లో లవ్ స్టోరీస్ అనేది ఎవర్‌ గ్రీన్‌ ఫార్ములా. అందుకే తొలి తరం సినిమాల నుంచి ఇప్పటి వరకు వెండితెర మీద ఎన్నో అద్భుతమైన ప్రేమకథలు వెండితెర మీద సందడి చేశాయి. అదే స్థాయిలో హీరోలు కూడా లవర్‌ బాయ్స్‌ గా ఆకట్టుకున్నారు. అలాంటి కొంత మంది తొలి తరం లవర్‌ బాయ్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన హీరో అక్కినేని నాగేశ్వరరావు. వెండితెర మీద రొమాంటిక్‌ హీరో అన్న ఇమేజ్‌ను తొలిసారిగా చూసిన హీరో ఏఎన్నార్‌. అప్పటి వరకు మూసగా సాగుతున్న తెలుగు సినిమాను డ్యాన్స్‌లు ఎలా ఉంటాయో చూపించింది కూడా అక్కినేనే. అందుకే తెలుగు తెర మీద తొలి లవర్‌ బాయ్‌ అక్కినేనే. ముఖ్యంగా దేవదాసు సినిమాతో ప్రేమికుడు అటే ఎలా ఉంటాడో చూపించాడు ఏఎన్నార్. ఈ సినిమాలో భగ్ర ప్రేమికులు అక్కినేని నటనకు దేశావ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంతేకాదు మజ్ను, ప్రేమ నగర్ లాంటి సినిమాలు కూడా అక్కినేనికి లవర్‌ బాయ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి.

 

ఇక అదే జనరేషన్‌లో లవర్ బాయ్ గా ఆకట్టుకున్న మరో హీరో శోభన్‌ బాబు. గ్లామర్ హీరో అన్న ఇమేజ్‌ను వెండితెర మీద తొలిసారిగా చూపించిన నటుడు శోభన్‌ బాబు. ఒక జనరేషన్ అమ్మాయిలకు కలల రాకుమారుడిగా ఎంతో క్రేజ్ సంపాందించుకున్న శోభన్‌బాబు వెండితెర మీద రొమాంటిక్‌ హీరోగా తిరుగులేని ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. తెర మీదే కాదు తెర వెనుక కూడా కూడాశోభన్‌ బాబు ప్రేమకథలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. మరో సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కూడా లవర్‌ బాయ్‌ గా ఆకట్టుకున్నాడు. జయప్రధ, శ్రీదేవి లాంటి హీరోయిన్లను వెండితెరకు పరొచయం చేసిన రికార్డ్ కూడా ఆయనదే.

మరింత సమాచారం తెలుసుకోండి: