సమంత అక్కినేని తెలుగు సినిమాకి పరిచయం పది సంవత్సరాలు దాటిపోయింది. ఏమాయ చేశావే చిత్రం ద్వారా పరిచయమై అందరినీ మాయ చేసిన ఈ భామ అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు పది సంవత్సరాలు స్టార్ హీరోయిన్ గా ముందుకు నడిచింది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న టైమ్ లోనే నాగచైతన్యని పెళ్ళి చేసుకుంది. పెళ్ళయ్యాక ఆమె సినిమాలు మానేస్తుంది కావొచ్చు అని అందరూ అనుకున్నారు.

 

 

కానీ సమంతకి పెళ్ళయ్యాక మరిన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చి పడ్డాయి. అంతే కాకుండా ఇంతకుముందులా గ్లామర్ పాత్రల జోలికి వెళ్లకుండా పాత్రల పట్ల చాలా సెలెక్టివ్ గా ఉంటోంది. తనకి నచ్చిన పాత్రలు వస్తేనే సినిమాలు చేయడానికి ఒప్పుకుంటోంది. అయితే ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు సమంతని తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవడానికి ఆలోచిస్తున్నారట. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత పారితోషికం కూడా ఎక్కువే.

 

 

 

అందువల్ల సమంతని హీరోయిన్ గాతీసుకోవడానికి ఆసక్తి చూపించట్లేదని టాక్ వినబడుతోంది. ఇదిలా ఉంటే మరి కొందరి వాదన మరోలా ఉంది. సమంతే కావాలనే తెలుగు సినిమాలు ఒప్పుకోవట్లేదని అంటున్నారు. తనకి తగ్గ పాత్రలు రాకపోవడం వల్లే ఆమె సినిమాలు తగ్గించిందని అంటున్నారు. ప్రస్తుతం సమంత చేతిలో తెలుగు సినిమాలు ఏవీ లేకపోవడం గమనార్హం.

 

 

 

అయితే జాను సినిమాలో ఎక్కువ పారితోషికం ఇచ్చి సమంతని తీసుకున్నప్పటికీ సినిమా విజయం సాధించకపోవడంతో సమంతకి బాగా మైనస్ గా మారింది. అలాగే ఆ సినిమాలో ఆమె లుక్ కి కూడా బాగా విమర్శలు వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో సమంతే తెలుగులో సినిమాలు చేయకూడదని డిసైడ్ అయిందని అంటున్నారు. అయితే తెలుగు సినిమాలు ఒప్పుకోవడం లేని సమంత తమిళంలో మాత్రం వరుసగా సినిమాలు ఒప్పుకుంటోందిట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: