మన టాలీవుడ్ చిన్న హీరో నుడి చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ హీరో వరకు ఒక సారి షూటింగ్ మొదలు పెట్టాకా రిలీజే లక్ష్యంగా పెట్టుకొని థియోటర్స్ లో బొమ్మ పడే వరకు క్షణం ఖాలీగా ఉండకుండా సినిమా కొసం సమయం కేటాయిస్తారు. ఓ వైపు షూటింగ్ మరో వైపు రిలీజ్ డేట్ ని మిస్ అవకూడదన్న టార్గెట్. అదే డేట్ లో మరో సినిమా ఉంటే ఆ సినిమాకొసం పోటీగా ప్రమోషన్స్ ... ఇంటర్వ్యూలు .. ఒకటేమిటి సినిమా సక్సస్ కోసం ఎంత చేయాలో అంతా చేస్తూ ఇంట్లో చాలా తక్కువ సమయం గడుపుతారు. అంతేకాదు సినిమా హిట్ టాక్ వచ్చినా యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ కోసం సినిమా రిలీజయ్యాక కనీసం ఒక నెలరోజులైనా సక్సస్ మీట్ లని సక్సస్ ట్రూర్స్ అని సినిమాని ప్రమోట్ చేయడానికే సమయం సరిపోతుంది. 

 

ఈలోపు మరో సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికి రెడీ గా ఉంటుంది. వచ్చి అందులో జాయిన్ అవుతారు. ఇలా మన హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతోనే విరామం లేకుండా కొన్ని నెలలపాటు సినిమాకే అంకితం అయిపోతారు. కానీ ఈ సారి అందరు తమ ఫ్యామిల్ల్స్ తో గడపడానికి చాలా రోజుల సమయం దొరికింది. ఏ సినిమా హడావుడి లేదు. ఏ సినిమా షూటింగ్స్ లేవు.  అనుకోకుండా వచ్చిన కరోనాతో స్టార్ హీరోలకు ఊహించని విధంగా రెస్ట్ దొరికింది. ప్రస్తుతం విదేశాల నుండి మన దేశంలోకి కూడా కరోనా వస్తుండటం చిరు నటిస్తున్న సినిమా నుండి చిన్న సినిమా వరకూ అందరూ షూటింగ్స్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. ప్రభాస్ కూడా జార్జియా షెడ్యుల్ ను నాలుగు రోజుల్లో కంప్లీట్ చేసుకొని తిరిగి ఇండియా బయలుదేరాడు. 

 

ఇక చిరు లాంటి స్టార్ హీరో షూట్ ఆపేసుకోవడంతో మిగతా హీరోలు నటిస్తున్న అన్ని షూటింగ్స్ ఆపేయాలని మిగతా సంఘాలతో కలిసి పిలుపినిచ్చింది నిర్మాతల సంఘం. దీంతో ఉన్నపళంగా షూటింగ్స్ కి బ్రేక్ పడింది. దీంతో చేసేదేం లేక ఫ్యామిలీతో ట్రిప్పులు కూడా వేయకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు స్టార్ హీరోలు. మహేష్ బాబు - తారక్ - నాని లాంటి వాళ్ళు ఇంట్లోనే తమ పిల్లల తో హాయిగా గడిపేస్తూ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ షూటింగ్స్ మొదలయ్యే వరకూ స్టార్ హీరోలు తమ ఫ్యామిలీస్ గడపుతూ సేద తీరుతారు. మొత్తానికి కరోనా మన హీరోలని ఎంత పని చేసింది. ఒకరకంగా చెప్పాలంటే ఎవరి ఇంట్లో వాళ్ళని బంధించేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: