మ‌న తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రో హీరోలు ల‌వ‌ర్ బాయ్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా చాలా మంది హీరోలు లవర్‌ బాయ్‌గా అప్పట్లో విశేష ప్రేక్షకాదరణ పొందారు.. పొందుతున్నారు. అలాంటి వారిలో రామ్ పోతినేని ఒక‌రు. చూడ‌డానికి చాలా స్మార్ట్‌గా క‌నిపించ‌డ‌మే కాకుండా ల‌వ‌ర్ బాయ్‌గా కూడా ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకున్నాడు. ఇప్ప‌టికే ఎన్నో సినిమాల్లో ల‌వ‌ర్ బాయ్‌గా న‌టించి మెప్పించాడు రామ్‌. అయితే ఇప్పుడు ఈయ‌న మాస్ సినిమాల‌కే ఎక్కువ‌గా మొగ్గు చూపుతున్నారు. మ‌రి ల‌వ‌ర్ బాయ్ గా చేసి చేసి మొహం మొత్తిందో.. ఏమోగాని.. ప్ర‌స్తుతం ఈయ‌న మాస్ సినిమాల‌కే గ్రీన్ ఇస్తున్నార‌ట‌.

 

ఇటీవ‌ల డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, హీరో రామ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఊర మాస్ సినిమా `ఇస్మార్ట్ శంక‌ర్‌` ఏ రేంజ్‌లో హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అప్ప‌టి వ‌ర‌కు లవర్‌ బాయ్‌గా కనిపించిన హీరో రామ్ ఈ సినిమాలో మాస్ లుక్‌లో కనిపించి.. అందరి ప్రశంసలు పొందాడు. మ‌రియు త‌న ఎన‌ర్జితో ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా మారాడు. ఇక  వరుస పరాజయాల నుంచి పూరి జగన్నాథ్‌ను బయటపడేసి భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా యూట్యూబ్‌లోనూ సత్తా చాటుతోంది. ఈ సినిమాతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ టాలీవుడ్ లో క్రేజీ & మాస్‌  హీరోగా మారిపోయాడు. 

 

కాగా, ప్రస్తుతం ఈ ల‌వ‌ర్ క‌మ్ మాస్ హీరో తమిళంలో ఘనవిజయం సాధించిన 'తడం' చిత్ర రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రెడ్ అని టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని  శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై కృష్ణ పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్‌.. క్లాస్‌, మాస్‌ లుక్స్‌లో అదరగొట్టినట్టుగా ఇటీవ‌ల రిలీజ్ అయిన టీజర్‌ను చూస్తేనే తెలుస్తోంది. ఇక‌ ఇస్మార్ట్‌ శంకర్‌తో సత్తా చాటిన రామ్‌.. ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు.
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: