కరోనా భయాలతో అన్ని చోట్ల షూటింగ్ లు ఆగిపోతే ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ మటుకు హైదరాబాద్ లోని అల్లూమీనియం ఫ్యాక్టరీలో రహస్యంగా షూటింగ్ జరుపుకుంటోంది అన్నవార్తలు ఫిలిం ఛాంబర్ దృష్టి వరకు వెళ్ళడంతో ఫిలిం ఛాంబర్ పెద్దలు కొందరు ఈ విషయమై రాజమౌళిని క్లారిటీ అడిగినట్లు సమాచారం. దీనితో రాజమౌళి అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న షూటింగ్ ను ఆపివేసినట్లు ఇండస్ట్రీ టాక్. 


వాస్తవానికి కరోనా భయంతో సంబంధం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మూవీ షూటింగ్ ను కొనసాగిస్తాను అని రాజమౌళి చెప్పిన మాటలను ఫిలిం ఛాంబర్ వర్గాలు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో కూడ ఈ వ్యాధి విస్తరిస్తున్న పరిస్థితులలో షూటింగ్ లపై బ్యాన్ ఈ నెలాఖరి తరువాత కూడ కొనసాగే కనిపిస్తోంది. 


ఇదే జరిగితే ఈ మూవీలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ అలియా భట్ డేట్స్ అన్నీ వృథా అయిపోవడంతో మళ్ళీ కొత్త డేట్స్ కోసం రాజమౌళి ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఈ మూవీకి సంబంధించి భారీ గ్రాఫిక్స్ పనులు ఉన్న పరిస్థితులలో ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యాక కనీసం ఈ మూవీ గ్రాఫిక్స్ పనులకే ఆరు నెలలు సమయం ఖచ్చితంగా కావలసి ఉంటుంది అని అంటున్నారు. అందువల్ల ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ డేట్ ను కూడ మిస్ అయ్యే ఆస్కారం ఉంది అంటూ ఇప్పుడు సరికొత్త ప్రచారం మొదలైంది. 


ఈ ప్రచారం రాజమౌళి దృష్టి వరకు వెళ్ళినా జరుగుతున్న పరిణామాలతో షాక్ లో ఉన్న జక్కన్న ఈ నెగిటివ్ ప్రచారాన్ని ఖండించే స్థితిలో లేడు అని అంటున్నారు. అదే జరిగితే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్ క్రిష్ ల మూవీకి మార్గం సుగమం అవుతుందని అదేవిధంగా మహేష్ పరుశు రామ్ దర్శకత్వంలో త్వరలో ప్రారంభించబోతున్న మూవీ అల్లు అర్జున్ సుకుమార్ ల మూవీలకు సంక్రాంతి రేస్ వేదిక అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు. అయితే ఇప్పటికే వాయిదాల పర్వం కొనసాగుతున్న పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ మరొకసారి వాయిదా వేస్తే వచ్చే ఏడాది సమ్మర్ కు కాని ఈ మూవీ విడుదలకు సరైన డేట్ దొరకక పోవచ్చు..  

మరింత సమాచారం తెలుసుకోండి: