టాలీవుడ్‌ లొ రొమాంటిక్ హీరో అన్న ఇమేజ్‌ ఆ ఫ్యామిలీకే సొంతం. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు తరాలు ఆ ఇమేజ్‌ను తమతోనే అట్టిపెట్టేసుకున్నారు ఆ ఫ్యామిలీ హీరోస్‌. వాళ్లు ఎవరో కాదు అక్కినేని ఫ్యామిలీ హీరోలు. 1940 నుంచి రొమాంటిక్ హీరో ఇమేజ్‌ ను తమ దగ్గరే పెట్టేసుకున్నారు అక్కినేని హీరోలు. జానపద చిత్రాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగేశ్వరరావు తరువాత కుటుంబం కథా చిత్రాలకు, ప్రేమ కథలతో ఆకట్టుకున్నాడు.

 

దేవదాసు, మజ్ను, ప్రేమ నగర్ సినిమాలతో ప్రేమికుడంటే ఇలా ఉండాలి అనిపించుకున్నాడు ఏఎన్నార్. తరువాత అదే ఇమేజ్‌ను కంటిన్యూ చేయటంలో సక్సెస్‌ అయ్యాడు నాగార్జున. మాస్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయినా.. తండ్రికి ఉన్న రొమాంటిక్‌ హీరో ఇమేజ్‌ను కూడా కంటిన్యూ చేశాడు నాగ్. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే మజ్ను లాంటి సినిమాలతో సక్సెస్‌ అయిన కింగ్‌, మన్మథుడు లాంటి సినిమాలతో ఆ ఇమేజ్‌ను తారా స్థాయికి తీసుకెళ్లాడు.

 

అదే ఇమేజ్‌ను మరో జనరేషన్‌ కూడా కంటిన్యూ చేసింది. నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య కూడా ప్రస్తుతం అదే ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. రొమాంటిక్ హీరోగా తాత, తండ్రి ఇమేజ్‌ను మరో మెట్టు ఎక్కించాడు చైతూ. వరుసగా లవ్‌ స్టోరీస్‌తో సూపర్‌ హిట్ లు అందుకుంటూ తాతకు, తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకుంటున్నాడు. ఇదే ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో అఖిల్ కూడా రొమాంటిక్ హీరోగా మెప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడు.

 

అఖిల్ సినిమాతో మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా సక్సెస్‌ కాకపోవటంతో తరువాత లవర్‌ బాయ్‌ మజ్నుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదనిపించాడు. ప్రస్తుతం మోస్ట్ ఎలిబిబుల్ బ్యాచిలర్‌గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: