హ్యాపీ డేస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యి కుర్రకారుని ఉర్రూతలూగించిన వరుణ్ సందేశ్ క్రేజ్ మొదటిలో ఎంత తారా స్థాయికి చేరుకొందో చివరిలో అంత అట్టగుడు స్థాయికి దిగజారింది. వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీలో వరుణ్ సందేశ్ కి మొట్ట మొదటి సినిమాకే పట్టిన అదృష్టం మరేతర హీరోకి పట్టలేదని చెప్పుకోవచ్చు. హ్యాపీ డేస్ సినిమాలో మధు అనే ఇంజనీరింగ్ విద్యార్థిని పాత్రలో నటించిన తమన్నా స్టార్ డమ్ పెరుగుతూ పోతుంది కానీ ఆమె సరసన నటించిన వరుణ్ సందేశ్ (చందు) స్టార్ డమ్ మాత్రం తగ్గడానికి కూడా ఏమి మిగలకుండా మాయమైపోయింది.




ఈ సినిమాలో మరో ఇంజనీరింగ్ స్టూడెంట్ పాత్ర లో నటించిన నిఖిల్ కూడా టాలీవుడ్ హీరో గా విజయవంతంగా కొనసాగుతున్నాడు. హ్యాపీ డేస్ సినిమా తర్వాత కొత్త బంగారు లోకం లో హీరోగా నటించి అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు వరుణ్ సందేశ్. కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తర్వాత సినిమాలతో శూన్యం అయిపోయింది. అయితే హ్యాపీ డేస్ లో నటించిన మిగతా వాళ్ళందరూ సక్సెస్ అవ్వడానికి... వరుణ్ సందేశ్ సక్సెస్ కాకపోవడానికి గల ఏకైక కారణం ఏంటని? ప్రశ్నిస్తే ఆయనకి ఏ సినిమాని సెలెక్ట్ చేసుకోవాలో ఏ సినిమాని ఎంపిక చేసుకోకూడదో తెలియకపోవడమేనట. ఈ నిజం మూడు సందర్భాల్లో బయటపడింది కూడా. అవేంటో ఒక సారి తెలుసుకుందాం.




బాగా క్రేజ్ ఉన్న సమయంలో వరుణ్ సందేశ్ కి 100% లవ్ సినిమాలో హీరోగా నటించమని ఆఫర్ వచ్చాడు ఆర్య ఫేమ్ డైరెక్టర్ సుకుమార్. కానీ అంత మంచి ఆఫర్ ని కాళ్ళ దన్నుకున్నాడు వరుణ్. అయితే ఈ సినిమాని చేజిక్కించుకున్న నాగచైతన్య క్రేజ్ మరో లెవెల్ కి చేరుకుంది. అప్పట్లో 100% లవ్ సినిమా యువతని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవేళ మిల్కీ బ్యూటీ తమన్నా సరసన 100% లవ్ లో వరుణ్ సందేశ్ నటించినట్లయితే ఈ చిత్రం అతని సినీ కెరీర్ కి ఒక మైలు రాయిగా మిగిలిపోయేది. 'దూరం దూరం' అనే పాటని ఇప్పటికీ ఎంతోమంది వింటున్నారంటే ఆ సినిమా ప్రేక్షకులలోకి ఎంతగా వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కానీ వరుణ్ సందేశ్ చేజేతులా ఈ మంచి సినిమాని వదులుకోవడం దురదృష్టం.



ఆ తరువాత బీమిలి కబడ్డీ జట్టు సినిమాలో హీరో గా నటించమని డైరెక్టర్ తాతినేని సత్య వరుణ్ సందేశ్ కి ఆఫర్ ఇచ్చాడు. కానీ వరుణ్ దురదృష్టవశాత్తు ఈ ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేశాడు. ఏదేమైనా ఈ సినిమాలో నాని హీరోగా నటించి మంచి మార్కులే కొట్టేసాడు. అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల మన్నలను కూడా పొందింది. ఇకపోతే మూడవది గుండెజారి గల్లంతయ్యిందే. ఈ సినిమాలో హీరోగా నటించమని డైరెక్టర్ విజయ్ కుమార్ కొండల అడిగితే వరుణ్ సందేశ్ 'నో' చెప్పాడు. దాంతో ఆ సినిమాలో హీరో ఆఫర్ ని కొట్టేశాడు నితిన్. ఈ సినిమా సూపర్ హిట్ అయిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ నిత్యామీనన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, కామెడీ సీన్లు ఎంతగానో అలరించాయి. దాంతో గుండెజారి గల్లంతయ్యిందే సినిమా హీరోగా నటించిన నితిన్ కి మంచి పేరు తెచ్చింది. కానీ రిజెక్టు చేసిన వరుణ్ సందేశ్ కి మాత్రం నిరాశనే మిగిల్చింది. ఈ విధంగా వచ్చిన 3 మంచి సినిమా అవకాశాలను రిజెక్ట్ చేసి తన సీనియర్ కెరీర్ మొత్తం నాశనం చేసుకున్నాడు వరుణ్ సందేశ్.



మరింత సమాచారం తెలుసుకోండి: