సమంత ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్‌. ఎటువంటి పాత్ర‌నైనా స‌రే అవ‌లీల‌గా పోషించ‌గ‌ల స‌త్తా ఉన్న న‌టి. స్టార్ హీరోయ‌న్‌గా కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే అక్కినేని నాగ‌చైత‌న్య‌ను వివాహం చేసుకుని వైవాహిక జీవితాన్ని మొద‌లెట్టేసింది. పెళ్ళైనప్ప‌టికి ఈ భామ సినిమాల్లో చేస్తూ హీరోయిన్‌గా కొన‌సాగ‌డం అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఆ త‌ర్వాత ఒక హీరోయ‌న్‌కి పెళ్ళైతే చాలు ద‌ర్శ‌కులు ఇక ఆ అమ్మాయి మీద పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ చూపించ‌రు. తిరిగి సినిమా అవ‌కాశాలు ఇచ్చేందుకు ఆలోచిస్తూ ఉంటారు. కానీ స‌మంత మాత్రం డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ పాత్ర‌ల‌ను ఎంచుకుని దూసుకుపోతుంది.

 

 అందరికీ షాకిచ్చి మజిలీ, ఓ బేబి, జాను వంటి మంచి చిత్రాల్లో న‌టిస్తూ మెప్పిస్తుంది. లేడీ ఓరియంటెడ్ పాత్ర‌లు ఎన్నుకున్న‌ప్ప‌టికీ త‌న పాత్ర‌కి ప్రాధాన్య‌త‌ను చూసుకుని స‌మంత అద‌ర‌హో అనిపించుకుంటుంది. కమర్షియల్ చిత్రాల‌కు దూరంగా ఉంటున్న సమంత ప్రస్తుతం మజిలీ, జాను వంటి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది.  అయితే పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుందట సమంత. కాని న‌ట‌న పై ఉన్న ఇంట్ర‌స్ట్‌తో అలా చెయ్య‌లేక మంచి పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ అలా చేసుకుంటూ వెళుతుంది. అయితే మొద‌ట్లో మాత్రం సినిమాల‌కు గుడ్ బై చెప్పేద్దామ‌నుకుంద‌ట‌. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీలో మొద‌టి నుంచి కూడా కొన్ని కండీష‌న్లు ఉంటాయి. దాంతో స‌మంత వ‌ద్ద‌నుకుందో ఏమోగాని గుడ్‌బై చెపుదామ‌ని ఇదే విషయంను భర్త నాగ చైతన్యకు చెప్పిందంట. 

 

అయితే చైతు ఈ విషయంలో సమంతకు వార్నింగ్ ఇచ్చాడట. నీకేమైనా పిచెక్కిందా. నిజంగా సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నావా ..! అంటూ ఆశ్చర్యంగా అడిగాడట. పెళ్లి తర్వాత సినిమాలకు చేయడానికి కారణం చైతు అని.. పెళ్లి తర్వాత ఎవరైనా బ్రేక్ తీసుకుంటే వారు మళ్లీ హీరోయిన్ గా కొనసాగిన సందర్భాలు లేవని.. అందుకే పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకోకుండా సినిమాలు చేయమని చైతు సపోర్ట్ చేశాడని సమంత చెప్పింది. ఇంత‌లా న‌న్ను స‌పోర్ట్ చేసే మంచి భ‌ర్త దొర‌క‌డం త‌న అదృష్ట‌మంటూ చాలా ఆనందంగా చెబుతోంది స‌మంత మ‌రి ఇలాంటి అర్ధం చేసుకునే భ‌ర్త దొర‌క‌డం నిజంగా స‌మంత అదృష్ట‌మ‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: