ప్రభాస్ తన లేటెస్ట్ మూవీ కోసం జార్జియాలో చేస్తున్న సాహసానికి బ్రేక్ ఇచ్చినట్లుగా ఈ మూవీ డైరెక్టర్ జిల్ రాథా కృష్ణ ఒక జాతీయ మీడియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈరోజు తెలియచేసాడు. కరోనా సమస్యలు తీవ్రంగా మారుతూ ఉండటంతో తమ జార్జియా షూటింగ్ కు బ్రేక్ వేశామని ప్రభాస్ తో సహా అందరి యూనిట్ సభ్యులు ఇండియాకు తిరుగు ప్రయాణం అయ్యామని 17వ  తారీఖున తాము హైదరాబాద్ చేరుకుంటున్నాము అంటూ రాథా కృష్ణ ఆ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ప్రతినిధితో జార్జియా నుండి ఫోన్ లో చెప్పినట్లుగా ఈరోజు ఒక కథనాన్ని ప్రచురించింది.


వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ మరికొద్ది రోజులు జరగవలసి ఉన్నా యూనిట్ సభ్యుల శ్రేయస్సు రీత్యా తామంతా ఇండియా బాట పడుతున్నాము అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా కేంద్రప్రభుత్వం ఈనెల 18 నుండి యూరప్ టర్కీ యూకే దేశాల నుండి వచ్చే వారిని ఎవర్ని ఇండియాలోకి అనుమతించము అని చెపుతున్న పరిస్థితులలో ఇప్పటికే ఇండియాకు బయలుదేరిన పూజ హెగ్డే ప్రియదర్శి లతో పాటు ప్రభాస్ పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు రావడం సహజం.


అయితే కరోనా వ్యాది పీడిత ప్రాంతాల నుండి వస్తున్న వారిని స్క్రీనింగ్ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ రూమ్స్ లో రెండు వారాల పాటు ఉంచే పరిస్థితులలో అలాంటి నిబంధన ఉంటుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. మరికొందరైతే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తమ ఇళ్ళల్లో ఐసాలేషన్ రూమ్స్ ఏర్పాటు చేసుకుని ఉండటానికి కరోనా వ్యాధి లక్షణాలు లేనివారిని అనుమతిస్తున్న పరిస్థితులలో ప్రభాస్ ను ఆ విధంగా అనుమతించే ఆస్కారం ఉంది అన్న అభిప్రాయం కూడ వ్యక్తం అవుతోంది. 


కరోనా యూరప్ లో విలయతాండవం చేస్తోంది అని తెలిసినా మాస్క్ లు పెట్టుకుని బాహుబలి లా యుద్ధం చేస్తాను అంటూ పది డిగ్రీల టెంపరేచర్ లో వానలను కూడ లెక్కచేయకుండా ప్రభాస్ ప్రయత్నించినా చివరికి ఈ బాహుబలి ని కూడ కరోనా కేర్ చేయలేదు అని తెలుస్తోంది. దీనితో ఫిలిం చాంబర్ ఇచ్చిన పిలుపుకు ప్రభాస్ కూడ స్పందించడంతో ఇక అన్నిచోట్ల షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయినట్లే అనుకోవాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: