తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న హీరోలు ఎంతోమంది. ఇక కొన్నేళ్ల క్రితం  అక్కినేని ఫ్యామిలీలో జాయిన్ అయిన సమంతా కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు కాలం నుంచి ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీ తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతంగా దూసుకుపోతోంది అనే చెప్పాలి. ఇంకో మాట ఏమిటంటే.. ఆనాడు తాత అక్కినేని నాగేశ్వర రావు కాలం నుంచి నేడు మనవడు అక్కినేని అఖిల్ వరకు.. అందరూ అక్కినేని కుటుంబంలో లవర్ బాయ్  అనే పేరు తెచ్చుకున్నారు. 

 

 

 అందుకే ఈ కుటుంబం మొత్తాన్ని లవర్ బాయ్  కుటుంబం అన్నట్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో చూస్తుంటారు. అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో సినిమాల్లో నటించి లవర్ బాయ్ గా పేరు తెచ్చుకుని నటసామ్రాట్ గా  మారితే... ఆ తర్వాత నాగార్జున టాలీవుడ్ మన్మధుడు గా మారిపోయాడు. ఇక నాగార్జున వారసుడు నాగచైతన్య... మొదటి సినిమాతోనే లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన అఖిల్ సినిమా పరంగా అంతగా విజయం సాధించలేక పోయినప్పటికీ అందం పరంగా మాత్రం ఎంతో మంది అమ్మాయిల మనస్సులను కొల్లగొట్టాడు. ఇలా అందరూ మగువల మనసులను కొల్లగొట్టిన వారే. 

 

 

 అయితే అందరూ లవర్ బాయ్ లు  ఉన్నప్పటికీ అక్కినేని కుటుంబంలో అసలు లవర్ బాయ్ ఎవరు అంటే... అఖిల్ అంటుంటారు. ఎందుకంటే సినిమాలు అంతగా విజయం సాధించకపోయినప్పటికీ మగువల మనసులు మాత్రం కొల్లగొట్టాడు అక్కినేని  అఖిల్ . అంతేకాదు అఖిల్ కి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు అని అంటుంటారు. ఒకానొక సమయంలో వదిన సమంత కూడా అక్కినేని అఖిల్ కి చాలా మంది గర్ల్  ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పుకొచ్చింది. అందుకే నేటి తరం లో అక్కినేని కుటుంబంలో చాలా మంది ఉన్నప్పటికీ అసలు సిసలైన లవర్ బాయ్ మాత్రం అక్కినేని అఖిల్ అంటూ ఉంటారు ప్రేక్షకులు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: