తెలుగులో ప్రస్తుతం ఉన్న దర్శకులలో చాలా మంది ఉన్నా తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సుకుమార్. లెక్కల మాస్టార్ అయిన సుకుమార్ తన సినిమాల్లోనూ ఈ లెక్కల జిమ్మిక్కులు చూపిస్తాడు. మోస్ట్ క్రియేటివ్ జీనియస్ అయిన సుకుమార్ తన సినిమాలని తెరకెక్కించడంలో చాలా ఆలస్యం చేస్తుంటాడు. సుకుమార్ ఇప్పటి వరకు చేసిన చిత్రాలన్నీ సంవత్సరం పైగా షూటింగ్ జరుపుకున్నవే.

 

ఒక్క 100% లవ్ తప్ప మిగతా చిత్రాలన్నింటికీ ఎంతో టైమ్ తీసుకున్నాడు. క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించడం వల్లే ఈ విధమైన ఆలస్యం అవుతుందని అంటారు. అయితే ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ రివేంజ్ డ్రామాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడట.

 

ఇప్పటి వరకు కొద్ది భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో మరికొద్ది రోజుల్లో అల్లు అర్జున్ పాల్గొననున్నాడు. కానీ కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ ని కొన్ని రోజుల పాటు ఆపేశారు. ఇలా ఆపడం సుకుమార్ కి కలిసి వచ్చిందట. నిజానికి సుకుమార్ అల్లు అర్జున్ షూటింగ్ కి వచ్చే ముందు కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని ప్రీ ప్రొడక్షన్ మీద దృష్టి పెడదామని అనుకున్నాడట. కానీ ఇప్పటికే ఆలస్యం అవుతుండడంతో ఊరుకున్నాడట.

 

కానీ ప్రస్తుతం కరోనా వల్ల వచ్చిన ఈ ఖాళీని తన వర్క్ కి బాగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాడట. తను ఏదైతే కావాలని అనుకున్నాడో దాని మీద ఎక్కువగా వర్కౌట్ చేస్తున్నాడట. మొత్తానికి కరోనా వల్ల సుకుమార్ సినిమాకి మేలే జరిగినట్టుంది. ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారట. మరి కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో రిలీజ్ లో మార్పు వస్తుండచ్చు అని వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: