టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన అతికొద్ది మంది హీరోల్లో నాని ఒకరు. వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండే నాని తాజాగా చేసిన ఒక ట్వీట్ రాజకీయ వర్గాల్లో, సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాని కులం గురించి ఒక ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ను నాని సాధారణంగా చేశాడో మరే ఇతర కారణాల వల్ల చేశాడో తెలియదు కానీ ఈ ట్వీట్ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 
 
నాని తన ట్వీట్ లో "పాలిటిక్స్, కులం, మతం, పవర్, డబ్బు, ఫేమ్ తొక్క తోలు ఏమీ ఉండదు చివరకి మనిషికి మనిషే... వి ఆర్‌ ఆల్‌ వన్‌ బిగ్‌ ఫ్యామిలీ అండ్‌ వి నీడ్‌ టు టేక్‌ కేర్‌ ఆఫ్‌ ఈచ్‌ అదర్‌.. బి రెస్పాన్సిబుల్‌.. బి సేఫ్‌.." అని పేర్కొన్నాడు. నాని చేసిన ట్వీట్ లో ఎలాంటి తప్పు లేకపోయినా ఏపీలో కుల రాజకీయం గురించి చర్చ జరుగుతున్న సమయంలో నాని చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. 
 
మూడు రోజుల క్రితం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రకటన అనంతరం సీఎం జగన్ ఎన్నికల అధికారి కులం గురించి ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వల్ల రాష్ట్రంలో కుల రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారం మీదే నాని సెటైర్ వేశాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 
మరికొందరు మాత్రం నాని టాలీవుడ్ ఇండస్ట్రీలో కుల జాడ్యం గురించి ప్రస్తావించి ఉండవచ్చని... రాజకీయ వ్యవహారాల్లో నాని జోక్యం చేసుకోడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేసిన నిరసనల నేపథ్యంలో నాని కులం గురించి ట్వీట్ చేసి ఉండవచ్చని చెబుతున్నారు. నాని చేసిన ట్వీట్ లో తప్పు లేకపోయినా ఈ ట్వీట్ గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. నాని స్పందిస్తే మాత్రమే ఈ ట్వీట్ ఎవరి గురించి చేశాడో... ఎందుకు చేశాడో తెలిసే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: