ప్రపంచాన్ని ఇప్పుడు తన గుప్పెట్లో పెట్టుకొని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్.. ప్రపంచ దేశాలన్నీ వణికిస్తుంది.  ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా గురించి వార్తలు మాత్రమే వస్తున్నాయి.  కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు భారత్ లో కూడా మొదలైంది.  దాంతో షాపింగ్ మాల్స్, థియేటర్లు, పాఠశాలలు సినిమా షూటింగ్స్ ఒక్కటేమిటి జనసంద్రంగా ఉండే ప్రదేశాలు మొత్తం మూసేస్తున్నారు.  దాంతో వ్యాపారస్తులు, రోజు కూలీలు, ట్యాక్సీ డ్రైవర్లు  ఇతర పని చేసుకునేవారు రోడ్డున పడే పరిస్థితి కి వచ్చింది.  ఏవరికైనా ప్రాణ భయమే.. దాంతో ఇప్పుడు కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే ప్రాణాల మీదకు వస్తుందన్న భయం మొదలైంది.

 

తాజాగా భారతీయుడు 2 షూటింగ్ ప్రమాదం నుంచి తప్పించకున్న కాజల్ తాను ఓ సంఘటన చూసి ఛలించిపోయానని.. ఓ ట్యాక్సీ డ్రైవర్ బాధ చూసి కన్నీరు వచ్చిందని తన ఇన్స్ స్ట్రాగామ్ లో పేర్కొంది.  వివరాల్లోకి వెళితే కరోనా వైరేస్ వల్ల ప్రపంచం మొత్తం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఎంత అరికాడుతున్నా దాని ప్రభావం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. సాధారణం జనం నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఒక టాక్సీ డ్రైవర్ గత 48గంటల్లో నేనే తన ఫస్ట్ కస్టమర్ అని చెప్పాడు.

 

నా భార్య ఈ రోజైనా నేను ఇంటికి సరుకులు తీసుకు వస్తానేమో అన్న ఆశతో ఎదురు చూస్తుంది మేడం అంటూ దీనంగా మాట్లాడాడు. అదే విధంగా అతను తన చివరి కస్టమర్ ని వదిలేసిన తరువాత 70కిలోమీటర్లు డ్రైవింగ్ ఒక్క కస్టమర్ అయినా దొరుకుతారా అన్న ఆశతో తిరిగానని అన్నాడు. అది విన్న నేను షాక్ అయ్యాను.. అయ్యో ఇతని ఒక్కని పరిస్థితితే ఇలా ఉంటే.. దేశ వ్యాప్తంగా ఎలా అన్న బాధ వేసిందని అన్నారు. వెంటనే అతనికి నేను 500రూపాయలు ఎక్కువగా ఇచ్చాను. ఈ విధంగా ఇబ్బంది పడుతున్న వారికి మనం ఎంతో కొంత సహాయం చేసి ఆదుకోవాల్సిన సమయం ఇది అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: