అల్లరి చేసే కొంటె కుర్రాడు. తన వచ్చిరని తెలుగుతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హ్యాపీడేస్ తో ఆహా అనిపించాడు. కొత్త బంగారులోకం సినిమాతో ప్రేమలో కొత్తదనాన్ని తీసుకొచ్చారు హీరో సందేశ్. సోలోగా వచ్చి తన నటనతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.

 

హ్యాపీడేస్ సినిమాతో తెరగ్రేటం చేశాడు హీరో. తన మాటలతో కొత్త బంగారులోకాన్ని సృష్టించుకున్నాడు ఈ చిన్నోడు. ఆ హీరో ఎవరో అనుకుంటున్నారా అదేనండి బిగ్ బాస్ షోలో ఫ్రూట్ గా మెప్పుపొందిన హీరో వరుణ్ సందేశ్.

 

హ్యాపీడేస్ సినిమాతో హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచమైయ్యాడు. కొత్తబంగారు లోకం సినిమాతో ఒక్క ట్రెండ్ ను సెట్ చేశాడు. నేటి యువతకు ఒక్క లవర్ భాయ్ గా పరిచయం అయ్యాడు. ఈ రెండు సినిమాలు వరుణ్ ని మంచి హీరోగా నిలబెట్టాయి. సినిమా అవకాశాలు ఎక్కుగానే ఉన్న తను హీరోగా ఎదగలేకపోయాడు.

 

అతను చేసిన రెండు, మూడు సినిమాల తర్వాత వచ్చిన సినిమాలన్ని ఫ్లాప్ అయ్యాయి. దింతో నటనకు పూర్తిగా దూరం అయ్యాడు. తన నిర్ణయాలు సరిగా లేవు. వచ్చిన కొద్ది ఆఫర్లలో కూడా కొన్ని సెట్స్ దాకా వెళ్లలేదు. ఈ సమయంలో ఏది చేసినా తప్పవుతుందేమోనని గ్యాప్ తీసుకున్నా.

 

వితికతో పెళ్లి అయిన తర్వాత నువ్వు చేస్తే మంచి సినిమా చెయ్ డబ్బులు తీసుకోకపోయినా పర్వాలేదు అని చెప్పింది. కొన్ని కథలు విన్నా, అవి చేస్తే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయోనని తర్జనభర్జన పడ్డా. మధ్యలో ఎస్ ఏపీ కోర్సు చేశారు.

 

చాలా రోజుల తర్వాత వరుణ్ బిగ్ బాస్ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ షోలో తనలో ఉన్న ఓ ప్రత్యేకతను అందరికి చూపించాడు. ఈ షో తన జీవితాన్ని మరో మలుపు తిప్పిందన్నారు. అతను మళ్ళి సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: