బుల్లితెరపై మకుటం లేని మహారాజుగా రాణిస్తున్న యాంకర్ ప్రదీప్ కోట్ల మంది అభిమానులను సంపాదించాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ అమలాపురం అబ్బాయి వాక్చాతుర్యానికి ఫిదా కానీ వారు ఎవరూ ఉండరు. ఇప్పుడు ఫుల్ యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటూ ఇతరులపై సెటైర్లు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. అలానే ఆడవారిని గౌరవించడం లో ప్రదీప్ మాచిరాజు ఎప్పుడూ ముందుంటాడని అందరూ మెచ్చుకుంటుంటారు. అప్పుడెప్పుడో ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికి పరువు పోగొట్టుకున్నాడే తప్ప మిగతా ఏ విషయాల్లో అతనిపై ఎటువంటి చెడ్డ పేరు రాలేదు.




ఇతనికి తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉండడంతో దర్శక నిర్మాతలు తనతో సినిమా తీస్తే అందరి ప్రజల్లోకి సినిమా వెంటనే వెళుతుందని భావించారు. ఈ కారణం వల్లనే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సందేశాత్మక రొమాంటిక్ ఫిలిం లో హీరో ఛాన్స్ కొట్టేశాడు ప్రదీప్. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్, పాటలు యూట్యూబ్ లో సంచలనం సృష్టించాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలో ప్రదీప్ నటనకి మార్కులు పడతాయో లేదో తెలియదు కానీ ఈ మూవీ ని ప్రమోట్ లో చేస్తున్న క్రమంలో ప్రదీప్ వ్యక్తిత్వం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.





అప్పటి అందాల నటుడు శోభన్ బాబుకి ఇప్పటి బుల్లితెర రారాజు యాంకర్ ప్రదీప్ కి ఎన్నో పోలికలు ఉన్నాయంట. అవేంటంటే శోభన్ బాబు ఎంత మంచి వారో ప్రదీప్ కూడా అంతే మంచి వాడట. తనను ప్రేమించిన వారిని హ్యాపీగా ఉంచడానికి ప్రదీప్ ఎప్పుడో ప్రయత్నిస్తూనే ఉంటాడట. ఒకరిని నొప్పించకుండా ఉండాలని ప్రదీప్ ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాడట. అప్పట్లో శోభన్ బాబుకి కూడా ఇటువంటి మంచి వ్యక్తిత్వమే ఉండేదట. మళ్ళీ శోభన్ బాబు తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అంతటి మంచి పేరున్న హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ద్వారా ప్రదీప్ తెచ్చుకుంటాడని సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. అందుకే అల్లు అర్జున్ కి దక్కే స్క్రిప్ట్ ప్రదీప్ కి దక్కిందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతున్న ప్రదీప్ మరో శోభన్ బాబు అవుతాడో లేదో చూడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: