తమిళ దర్శకుడు మురుగదాస్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన చేసే చిత్రాలలో సామాజిక అంశాలతో పాటు కమర్షియల్ హంగులు కూడా ఉంటాయి. కమ్షియల్ హంగులని సామాజిక సందేశానికి జోడించి సినిమాలు తీయడంలో శంకర్ తర్వాత మురుగదాస్ ఎక్స్ పర్ట్ అనే చెప్పాలి. రమణ (తెలుగులో)  సినిమా నుండి విజయ్ తో తీసిన కత్తి సినిమా వరకు అదే పంథాని ఫాలో అవుతూ మంచి విజయాలు అందుకున్నాడు.

 

 

అయితే కత్తి తర్వాత మురుగదాస్ నుండి వచ్చిన చిత్రాలు ఏవీ ఆకట్టుకోలేదు.  విజయ్ తో తీసిన సర్కార్ అయితేనేమి, సూపర్ స్టార్ మహేష్ తో తీసిన స్పైడర్ అయితేనేమీ, మొన్నటికి మొన్న రజనీ కాంత్ దర్బార్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఈ మూడు చిత్రాల్లో మురుగదాస్ మార్క్ మిస్సయ్యిందనే టాక్ వచ్చింది. ఒకప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన మురుగదాస్ ఇంత పేలవంగా సినిమాలు తీయడం జీర్ణించుకోలేకపోయారు.

 

ప్రస్తుతం మురుగదాస్ చేతిలో సినిమాలేవీ లేవు. కానీ తాజా సమాచారం ప్రకారం తమిళ స్టార్ విజయ్ తో మురుగదాస్ సినిమా చేయబోతున్నాడని ప్రచారంజరుగుతోంది. విజయ్ తో ఇప్పతి వరకు మూడు చిత్రాలని తీసిన మురుగదాస్ మరోసారి జత కట్టబోతున్నాడట. ఈ మేరకు కొలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మురుగదాస్ సినిమాల్లో తన మార్క్ మిస్సయినా కూడా విజయ్ కి మురుగదాస్ పై నమ్మకం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారని అంటున్నారు.

 


మరి నిజంగానే విజయ్ మురుగదాస్ తో సినిమా చేస్తున్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒక విషయం ఏంటంటే, మురుగదాస్ తో సినిమాలు మానేసిన విజయ్ అట్లీతో వరుస సినిమాలు చేస్తూ వెళ్ళాడు. ఆ సినిమాలన్నీ ఎలాంటి విజయం సాధించాయో అందరికీ తెలిసిందే.  మరి ఇప్పుడు మళ్ళీ మురుగదాస్ వద్దకి వస్తాడో రాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: