తెలుగు ఇండస్టీలో ఇప్పటి వరకు బాలీవుడ్ లో నుంచి ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు.  'కుమారి 21 ఎఫ్‌' చిత్రంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. యువతలో విపరీతమైన క్రేజ్ వచ్చింది హెబ్బాకు. మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురైన, వాటిని దైర్యంగా ఎదుర్కోంటూ ముందుకెల్తుంది.  ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడ మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ అమ్మడు ఒక వైపున హీరోయిన్ గా  చేస్తూనే, మరో వైపున కీలకమైన పాత్రలు చేస్తూ వస్తోంది. ఇటీవల రామ్ 'రెడ్' సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చక చకా షూటింగ్ జరుపుకుంటోంది. 

 

ప్రస్తుతం హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుంటున్నారు. ఇటీవల రామ్ - హెబ్బా పటేల్ కాంబినేషన్లో ఒక ఐటెమ్ సాంగును హైదరాబాదు - రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. ఈ ఐటెమ్ సాంగులో అందాలు ఆరబోయడానికి హెబ్బా పటేల్ ఎంతమాత్రం మొహమాట పడలేదట. హద్దులు దాటేసి ఆమె ఒలకబోసిన వయ్యారాలు యూత్ ను ఒక ఊపు ఊపేస్తాయని అంటున్నారు. తాజాగా హెబ్బా పటేల్ ఐటమ్ సాంగ్స్ కి ఒప్పుకున్న విషయం తెలిసిందే. 

 

ఈ నేపథ్యంలో రామ్ ద్విపాత్రాభియంలో నటిస్తున్న రెడ్ మూవీలో రామ్ - హెబ్బా పటేల్ కాంబినేషన్లో ఓ దుమ్మురేపే ఐటమ్ సాంగ్ ఉంబడోతుందట.  ఈ ఐటమ్ సాంగ్ లో హెబ్బా పటేల్ ఇప్పటి వరకు కనిపించని విధంగా రెచ్చిపోయి కనిపించబోతుందని అంటున్నారు.  సాంగ్ కూడా ఫుల్ జోష్ తో సాగుతుందట.. రామ్ అంటేనే ఎనర్జిటిక్ హీరో ఆ మద్య వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో తన విశ్వరూపం చూపించాడు.  మరి ఈ రెడ్ లో తన రెండు పాత్రల్లో ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో చూడాలి. ఇక రామ్ సరసన హెబ్బా పటేల్ పాటేల్ ఎంతగా రెచ్చిపోతుందో చూాడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: