ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాజ్ తరుణ్ సినిమా చూపిస్తా మామ, కుమారి 21 ఎఫ్, వరుస మూడు సినిమాలతో మంచి హిట్ ను సంపాదించుకున్నారు.  కిట్టు ఉన్నాడు జాగ్రత్త, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత వచ్చిన ఈడో రకం ఆడో రకం, రంగుల రాట్నం హిట్ ని అందుకున్నాయి. భారీ అంచనాలతో నిర్మించిన రాజుగాడు, లవర్స్ సినిమాలు బాక్సఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 

 

హీరోగా తనదైన శైలి లో గుర్తింపు పొందిన రాజ్ తరుణ్ మే 12, 1992లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జన్మించారు. తండ్రి బసవరాజు బ్యాంకులో ఉద్యోగి. తల్లి గృహిణి. విశాఖపట్నంలో ఇంటర్ పూర్తి చేసుకొని ఎంసెటలో మంచి ర్యాంకును సాధించాడు. ఎంవీజీఆర్ కాలేజ్ లో 6నెలలు కాలేజికి వెళ్లి చదువు మానేశాడు. 

 

స్కూల్ డేస్ లో కాలికి దెబ్బ తగలడంతో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు రోజుకి 3సినిమాలు చూసేవారు. సినిమాలోని పాత్రలు, దర్శకత్వం ఆసక్తి ఏర్పడింది. 8వ క్లాస్ నుంచే సినిమాలు చూడటం, బుక్స్, డైలాగ్స్ రాయడం మొదలు పెట్టాడు. తనే దర్శకుడిగా మారి ఎన్నో షార్టుఫిల్మ్ లో నటించడం, దర్శకత్వం వహించాడు. ఇంటర్ పూర్తి అయ్యే నాటికి 50 వరకు షార్ట్ ఫిల్మ్ లు నిర్మించాడు.

 

కెరీర్ పూర్తిగా ముగింపు దశలో ఉన్నప్పుడు దిల్ రాజు నిర్మాణంలో ఇద్దరి లోకం ఒకటే సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమా రావడంతో కనీసం రాజ్ తరుణ్ మళ్లీ హిట్ కొట్టి తనను తాను నిరూపించుకుంతాడని ఆశించారు అభిమానులు. జి ఆర్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అత్యంత దారుణంగా డిజాస్టర్ అయిపోయింది.

 

ఇలాంటి సమయంలో కూడా మరో సినిమా అవకాశం అందుకున్నాడు రాజ్ తరుణ్. ఒరేయ్ బుజ్జిగాడా సినిమా కొరోనా కారణంగా రిలీజ్ ఆగిపోయింది. ఈ సినిమా అయినా విజయాన్ని అందిస్తుందేమో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: