తెలుగు ఇండస్ట్రీలో మెగా స్టార్ చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాల్లో కొన్ని ఎప్పటికీ మరుపురాని విధంగా ఉన్నాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి ‘కొండవీటి దొంగ’.  ఉన్నత చదువు చదువుకొని సమాజంలో కొంత మంది దేశ ద్రోహుల భరతం పట్టడానికి కొండవీటి దొంగగా మారుతాడు చిరంజీవి.  ఇది రాబిన్ హుడ్ కథలా ఉంటుంది.  ఉన్న వారిని దొచి లేని వారికి పంచి పెట్టే కాన్సెప్ట్.  ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ హిట్ అయ్యింది.  తాజాగా ఈ మూవీ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది.  ఈ చిత్రంలో మెగాస్టార్ పర్ఫామెన్స్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.  

 

ఈ చిత్రం కథ రాసింది పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాల కృష్ణ  ఈ చిత్రం గురించి ఎన్నో విశేషాలు తెలిపారు.  ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కోసం అల్లుకున్న కథ అని.. నిర్మాత త్రివిక్రమరావు కూడా ఎంతో సంతోషించారు. ఈ కథ వినిపించడానికి నేనే స్వయంగా శ్రీదేవి ఇంటికి వెళ్లానని.. ఆమె కథ విని చాలా బాగుందని అన్నారు. అయితే ఆమె కథ అంతా విన్న తర్వాత కొన్ని కండీషన్స్ పెట్టారు.  హీరోయిన్ గా శ్రీదేవిని అనుకుంటున్నట్టుగా చెప్పి, ఆమెను కలిశాను.

 

శ్రీదేవి ఇంటికి వెళ్లి నేనే కథ చెప్పాను. అంతా విన్న తరువాత ఈ సినిమా టైటిల్ ను 'కొండవీటి రాణి - కొండవీటి దొంగ' గా మార్చాలనే షరతు పెట్టారు. అలాగే లవ్ చేయమని హీరో వెంట హీరోయిన్ పడటాన్ని, హీరోనే హీరోయిన్ వెనక పడేలా మార్చమని అన్నారు. ఇదే విషయాన్ని నేను నిర్మాత  త్రివిక్రమరావుగారికి చెబితే.. అబ్బే అలా చేస్తే ఈ చిత్రంలో హీరోయిజం పూర్తిగా డామినేట్ అవుతుంది.. ప్రజలు తిప్పి కొడతారని అన్నారు.  అందుకే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు విజయశాంతి, రాధ లను పెట్టి తీశాం. ఈ చిత్రం అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: