మెగాస్టార్ చిరంజీవి తో సినిమా అనగానే చాలా మంది దర్శకులు ఎక్కువగా పోటీ పడుతూ ఉంటారు. ఆయనతో ఒక్క అవకాశం వచ్చినా చాలు సినిమా చేయడానికి అనుకుని తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. అవకాశం వచ్చిన దర్శకులు అయితే ఇక వెనుతిరిగి చూసుకునే అవకాశం ఉండదు అని బెస్ట్ సినిమా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి గాను కొంత మంది దర్శకులు ఎక్కువగా పోటీ పడుతున్నారు. ఆయనతో కొరటాల శివ ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. 

 

ఇక ఈ సినిమా తర్వాత ఆయన లూసిఫర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కథ ఇప్పటికే సిద్దమైంది అంటుంటే అవ్వలేదు అని మరికొందరు అంటున్నారు. ముందు ఈ సినిమా దర్శకుడిగా... వీవీ వినాయక్ అనుకున్నారు. ఆ తర్వాత కృష్ణ వంశీ పేరు కూడా వినపడింది. అయినా సరే చిరంజీవి మాత్రం వాళ్ళను కాదని, యువ దర్శకులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకోసం సుజిత్ సహా మరో యువ దర్శకుడికి చిరంజీవి ఆఫర్ ఇచ్చారు. మరో దర్శకుడు ఎవరు అనేది తెలియదు. 

 

అయితే ఈ సినిమా కథను ఎవరు తెలుగు నేటివిటి తగ్గట్టు తయారు చేస్తే వాళ్లకు అవకాశం ఇస్తా అని చెప్పారట. దీనితో వాళ్ళు ఎక్కువగా కష్టపడుతున్నారు. సుజిత్ కి మహేష్ తో సినిమా చేసే ఆఫర్ వచ్చింది అంటున్నారు. ఆ ఆఫర్ ని సుజిత్ ని పక్కన పెట్టి ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు అంటున్నారు. ఆ సినిమా కోసం లేట్ అయినా పర్వాలేదు గాని చిరూ తో సినిమా చెయ్యాలని సుజిత్ పట్టుదలగా ఉన్నారట. త్వరలోనే కథలో కొంత భాగాన్ని చిరంజీవి ని కలిసి వినిపించే ప్రయత్నం చేస్తారని, చిరంజీవి ఓకే అంటే ముందుకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: