టాలీవుడ్ లో అడుగు పెట్టి దాదాపు మూడు నాలుగేళ్ళు అయినా సరే ఇషా రెబ్బా మాత్రం హీరోయిన్ గా పూర్తి స్థాయిలో సినిమాలు చేయలేకపోతుంది. అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆమెకు పూర్తి స్థాయిలో హీరోయిన్ గా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇషా రెబ్బా కోసం టాలీవుడ్ దర్శకులు కూడా ఆసక్తి చూపించడం లేదు. కాని ఆమెను సెకండ్ హీరోయిన్ గా తీసుకుంటున్నారు. కాని నటనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో పూజ హెగ్డే చెల్లి గా ఆమె నటించింది. 

 

సినిమా సూపర్ హిట్ అయినా సరే ఆమెకు మాత్ర౦ ఆ తర్వాత సరైన అవకాశం అనేది రాలేదు. ఏదో ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి గాని తెలుగు అమ్మాయి అయినా సరే అగ్ర దర్శకులు ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదు. అటు తమిళంలో కూడా ఆమె సినిమాలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. సోషల్ మీడియాలో ఆమె హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తుంది. ఆ ఫొటోస్ కి క్రేజ్ ఉన్నా సరే ఆమెకు మాత్రం అవకాశాలు రావడం లేదు. 

 

ఇటీవల ఆమెకు ఒక సినిమాలో ఆఫర్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. దీనితో ఆమె మళ్ళీ కన్నడ సినిమా ల మీద దృష్టి పెట్టింది. అక్కడ ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. అయినా సరే ప్రాధాన్యత ఉన్న పాత్రలు రావడం లేదు. దీనిపై ఇషా ఇప్పుడు అసహనంగా ఉందట. తాను డిమాండ్ చేయకపోయినా సరే తనకు ఆఫర్లు ఎక్కువగా రావడం లేదనే అసహనం ఆమెలో వ్యక్తమవుతుంది. తనకు ఉన్న పరిచయాలను ఎన్ని విధాలుగా వాడే ప్రయత్నం చేసినా సరే అవకాశాలు రావడం లేదట. ఒకానొక దశలో ఆమె సినిమాల నుంచి తప్పుకునే ఆలోచన కూడా చేసినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: