ఈ ఏడాది టాలీవుడ్ లో ఉగాది కోసం చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉగాది రోజున వచ్చే కొన్ని ఫస్ట్ లుక్స్ తో పాటుగా మరికొన్ని టీజర్స్ కూడా విడుదల అయ్యే అవకాశ౦ ఉందని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా టీజర్ కూడా ఆ రోజే విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే మహేష్ బాబు సినిమా ఫస్ట్ లుక్ కూడా ఆ రోజే బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే మరికొన్ని సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ కి ఒక గుడ్ న్యూస్ ఆ రోజు వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ రోజు ఎన్టీఆర్ నిర్మాణ సంస్థను లాంచ్ చేసే సూచనలు కనపడుతున్నాయని అంటున్నారు. నిర్మాణ సంస్థ పేరు భార్గవ్ హరి గా ఎన్టీఆర్ ఫిక్స్ చేసాడు అంటున్నారు. దీనిపై ఆ రోజు అధికారిక ప్రకటన తో పాటుగా లోగో కూడా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. అదే విధంగా ఎన్టీఆర్ నానీ తో చేసే సినిమాను కూడా ఆ నిర్మాణ సంస్థ కింద ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

ఇక ఎన్టీఆర్ భవిష్యత్తులో చేయబోయే కొన్ని సినిమాలను ఆ నిర్మాణ సంస్థలోనే చేస్తారని అంటున్నారు. ఇక ఈ కార్యక్రమానికి బాలకృష్ణ తో పాటుగా నందమూరి కుటుంబం మొత్తం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక రామ్ చరణ్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాగా ఎన్టీఆర్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అధికారికంగా ప్రకటించినా విడుదల అవుతుంది అనే నమ్మకం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: