టాలీవుడ్ జనాలు పనులు మానుకుని మరీ ఎదురు చూసే విషయం, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క వివాహం. ఆమె పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అనేది ఎవరికి అర్ధం కాని పరిస్థితి. ప్రస్తుతం ఆమె పెళ్లి గురించి టాలీవుడ్ లో చాలా జరుగుతున్నాయి. ఆమె అప్పుడు పెళ్లి చేసుకుంటుంది ఇప్పుడు చేసుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నారు. దీనిపై ఏ సమాచారం లేకపోయినా సరే మీడియాలో కూడా ఎక్కువగా ఆమె పెళ్లి గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఆమె ఖండిస్తూనే ఉన్నారు. 

 

ఇక ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనేది కూడా మీడియా నే ఎక్కువగా చెప్తూ ఉంటుంది. అయితే ఆమె పెళ్లి చేసుకునేది మాత్రం బయటకు లీక్ అయ్యే అవకాశం లేదని విదేశాల్లో ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుంటుంది అంటున్నారు. ఆమె అమెరికాలో ఉండే ఎన్నారై ని పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అవుతుంది అంటున్నారు. ఈ పెళ్లి కూడా అక్కడే జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది టాలీవుడ్ జనాల మాట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు. ప్రస్తుతం ఆమె చేసే సినిమాలకు కూడా గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

ఒక చిన్న వార్త వస్తే చాలు దానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించే మీడియా ఈ విషయంలో కూడా అదే విధంగా చేస్తుంది. ఆమె వివాహం ఏమో గాని ఆమె చేసుకోకపోతే మాత్రం కొంత మంది గుండెలు ఆగిపోయే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పలువురు సరదా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనుష్క ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత మరో సినిమాను ఆమె లైన్లో ఉంచారు కూడా. ఆ సినిమా తర్వాత తమిళంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత పెళ్లి.

మరింత సమాచారం తెలుసుకోండి: